Alexei Navalny: పుతిన్ ఒక “కిల్లర్”.. నవల్నీ మృతికి కారణం.. యూరప్ అంతటా నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించడంపై వెస్ట్రన్ దేశాలు పుతిన్‌పై భగ్గుమంటున్నాయి. శుక్రవారం నవల్నీ జైలులో మరణించారు. అతని మరణానికి రష్యా అధ్యక్షుడే కారణం అని.. పుతిన్ “కిల్లర్” అంటూ యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో ప్రజలు నినదించారు. యూరప్ లోని పలు నగరాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ముఖ్యంగా రష్యన్ ఎంబసీల ముందు నిరసన తెలిపారు. నవల్నీది మరణం కాదని హత్య అని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. రోమ్, ఆమ్స్టర్డామ్, బార్సిలోనా, సోఫియా, జెనీవా,ది హేగ్‌లలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం..గర్భిణిపై గ్యాంగ్ రేప్ చేసి, నిప్పంటించారు..
Also Read
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
- Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
- Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు 'ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' ప్రదానం
నవల్నీ మరణంపై బ్రిటిష్ ప్రభుత్వం రష్యా రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది. అతని మరణానికి రష్యా అధికారులే పూర్తి బాధ్యత వహించాలని సమన్లలో పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమాధానం చెప్పాలని బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ శుక్రవారం అంతకుముందు అన్నారు. యూకే పీఎం రిషి సునాక్ నవల్నీ మరణానికి నివాళులు అర్పించారు.
రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌కి గట్టి ప్రత్యర్థిగా అతని విధానాలను వ్యతిరేకించిన వ్యక్తిగా అలెక్సీ నవల్నీకి పేరుంది. అయితే, గత దశాబ్ధ కాలంగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో అతనిపై జైలులో విషప్రయోగం జరిగినట్లు ఆరోపించారు. తనను పుతిన్ అంతం చేయాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం అనూహ్య పరిస్థితుల్లో మరణించారు.
తాజావార్తలు
-
SCO Civilisational Dialogue Forum: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పరిణామం.. SCO సమావేశానికి పాక్ మంత్రికి భారత్ ఆహ్వానం!
-
Cyclone Arnab: ఉప్పాడ తీరంలో రాకాసి అలల బీభత్సం.. 30 ఇళ్లు నేలమట్టం, కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసం!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..