FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Khalistani Terrorist: ఖలిస్తాన్ టెర్రిరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌కి మద్దతుగా మాట్లాడినందుకు న్యూజిలాండ్ ఉప ప్రధాని విన్స్టన్ పీటర్స్‌ని బెదిరించాడు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు లేవని విన్స్టన్ పీటర్స్ అన్నారు. నిజ్జర్ హత్యలో కెనడా భారత ప్రమేయం ఉన్నట్లు సరైన ఆధారాలు ఇవ్వలేదని పీటర్స్ పేర్కొన్నారు.
Bombay High Court: అర్ధరాత్రి ఒంటిగా ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టిని అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ భర్త పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో…
IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Hyderabad Liberation Day: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదారాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్‌లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది.
Mukhtar Ansari: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవతఖైదు విధించింది. 1990లో నకిలీ పత్రాలను ఉపయోగించి అక్రమంగా ఆయుధ లైసెన్స్ పొందిన కేసులో బుధవారం అన్సారీకి జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 428 (అపరాధం), 467 (విలువైన భద్రతను ఫోర్జరీ చేయడం), 468 (మోసం కోసం ఫోర్జరీ), 120బి (నేరపూరిత కుట్ర) మరియు ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30 కింద జైలు శిక్ష అనుభవిస్తున్న మాఫియా…
Manohar Lal Khattar: హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం ఖట్టర్ 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. కర్నాల్ లోక్‌సభ అభ్యర్థిగా ఖట్టర్‌ని బీజేపీ బరిలోకి దింపొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Hardeep Nijjar Killing: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదానికి కారమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలు చేసిన కెనడాకు మిత్ర పక్షం న్యూజిలాండ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొలిజాబితాలో ఉన్నారని, కానీ నితిన్…
China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది.