Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన బొగ్గు గని.. 12 మంది దుర్మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు. రెస్క్యూ ముగిసిన తర్వాత మొత్తం మృతుల సంఖ్య 12గా తేలిందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఖోస్ట్ మైనింగ్ ప్రాంతంలో ప్రైవేట్ బోగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో పలువురు కార్మికులు భూమి అడుగున 800 అడుగుల కింద చిక్కుకుపోయారు.
Read Also: Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ పాయింట్ ని ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు: హీరో శ్రీవిష్ణు
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మొత్తం 12 మంది మృతదేహాలను వెలికితీయడంలో సహాయక చర్యలు ముగిశాయని బలూచిస్తాన్ ప్రావిన్స్ మైన్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఘనీ బలోచ్ చెప్పారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. మిథేన్ వాయువు కారణంగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. గని ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
పాకిస్తాన్‌లో పెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్ అత్యంత వెనకబడిన ప్రాంతం. జనాభా కూడా చాలా తక్కువ. అయితే ఈ ప్రాంతం విలువైన ఖనిజ నిల్వలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో గని నిర్వహణకు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మే 2018లో, అదే ప్రాంతంలోని రెండు పొరుగు బొగ్గు గనులలో గ్యాస్ పేలుళ్ల కారణంగా 23 మంది మరణించారు మరియు 11 మంది గాయపడ్డారు. 2011లో మరో బలూచిస్థాన్ కొలీరీలో గ్యాస్ పేలుళ్ల కారణంగా గని కూలిపోవడంతో 43 మంది మరణించారు.
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!