Anil Ravipudi: ఈమధ్య కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా వినిపించే పేరు అనిల్ రావిపూడిదే, ఎందుకంటే కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, నిర్మాత శ్రేయస్సును కోరుకునే క్రమశిక్షణ గల దర్శకుడిగా ఆయన తాజాగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఆయన రూపొందించిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన వేళ, ఈ సినిమా నిర్మాణంలో అనిల్ చూపించిన చాకచక్యం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
READ ALSO: West Bengal: కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు! రంగంలోకి రెస్క్యూ టీమ్
2025 మే నెలలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, డిసెంబర్ 4 నాటికి పూర్తి అయింది, అయితే వాస్తవానికి మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా దాదాపు 45 రోజులు షూటింగ్ నిలిచిపోయింది. అయినప్పటికీ, పక్కా ప్లానింగ్‌తో అనిల్ కేవలం 78 రోజుల్లోనే మొత్తం షూట్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనిల్ రావిపూడిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఖర్చును తగ్గించి అవుట్‌పుట్‌ను పెంచడం. జూన్‌లో డెహ్రాడూన్‌లోని ఒక స్కూల్‌లో 17 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడకు వెళ్ళారు కానీ, భారీ వర్షాల కారణంగా అకారణంగా అక్కడ ముంగించాల్సి వచ్చింది. అక్కడ తీయాల్సిన ఇండోర్ సీన్స్‌ను హైదరాబాద్‌లోనే సెట్ వేసి చేయొచ్చని గుర్తించిన అనిల్, ఆ షెడ్యూల్‌ను 5 రోజులకు కుదించారు. దీనివల్ల నిర్మాతకు ఏకంగా 75 లక్షల రూపాయలు ఆదా అయ్యాయి.
ఇక మరోపక్క పట్టు వదలని విక్రమార్కుడు: కేరళలో పెళ్లి సీన్ తీస్తున్నప్పుడు భారీ వర్షం పడింది. షూటింగ్ ఆగిపోతే ఆర్టిస్టుల డేట్స్ వృథా అవుతాయని భావించిన అనిల్, వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే గొడుగులు పట్టుకుని పెళ్లి జరుగుతున్నట్లు సీన్‌ను మార్చి చిత్రీకరించారు. ఆ సమయస్ఫూర్తికి యూనిట్ మొత్తం షాక్ అయిందట. అనిల్ పనితీరును చూసి ముచ్చట పడ్డ మెగాస్టార్ చిరంజీవి గారు ఒకానొక సందర్భంలో ఆయన్ని ఆకాశానికెత్తేశారు. “నువ్వు ఇండస్ట్రీకి దొరకడం మా అదృష్టం. నీ వేగం చూస్తుంటే కోదండరామిరెడ్డి గారు, నీ టైమింగ్ చూస్తుంటే జంధ్యాల గారు గుర్తు వస్తున్నారు” అంటూ అభినందించారు, ఒక దర్శకుడికి ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఇంకేముంటుంది?
సాధారణంగా సినిమాల బడ్జెట్ అనుకున్న దానికంటే పెరుగుతుంటుంది. కానీ అనిల్ మాత్రం అందుకు భిన్నం. దాదాపు 50 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ఈ సినిమాను, తన పక్కా ప్లానింగ్‌తో కేవలం 32 కోట్లలోనే పూర్తి చేశారు. అంటే దాదాపు 18 కోట్లు ఆదా చేసి నిర్మాతకు అండగా నిలిచారు. గతంలో కూడా సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత శిరీష్ అనిల్ రావిపూడి మేకింగ్, డబ్బు ఆదా చేసే పద్దతి గురించి ఆకాశానికి ఎత్తేశారు.
భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి నిర్మాతలను ఇబ్బంది పెట్టే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో, క్వాలిటీ తగ్గకుండా తక్కువ ఖర్చుతో సినిమాను ముగించే అనిల్ రావిపూడి లాంటి వారు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని నమ్మే అనిల్ రావిపూడి నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ‘ఆణిముత్యం’. ఆయన సినిమా టైటిల్ బాషలో చెప్పాలంటే అనిల్ రావిపూడి ది గ్రేట్.
READ ALSO: Sankranti Pindi Vantalu: ఈ పండుగకు సింపుల్‌గా.. షార్ట్ టైంలో చేసుకునే 5 రకాల పిండి వంటలు ఇవే..