Air India: మరోసారి నిబంధనల ఉల్లంఘనలో ఎయిర్ ఇండియాకు జరిమానా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైనర్‌కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జరిమానా విధించింది. తాజాగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్‌డిటిఎల్), ఫెటీగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌ఎంఎస్) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.
Read Also: Zomato CEO: జొమాటో సీఈవో సీక్రెట్‌గా రెండో పెళ్లి.. అమ్మాయెవరంటే…!
సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ పీరియడ్స్, అల్ట్రా లాంగ్ రేంజ్ ఫ్లైట్‌లకు ముందు తగినంత విశ్రాంతి ఇవ్వడం లేదని, లేఓవర్ సమయంలో అనేక నిబంధనల్ని ఉల్లంఘనలనున జనవరి ఆడిట్ వెల్లడించిన తర్వాత డీజీసీఏ జరిమానా విధించింది. పైలెట్లు డ్యూటీ సమయాన్ని మంచి విధులు నిర్వహించిన సందర్భాలను కూడా ఆడిట్ బయటపెట్టింది. ఇలాంటి ఉల్లంఘనలు విమాన భద్రత, ప్రయాణికుల శ్రేయస్సుకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయి.
నివేదికలు, సాక్ష్యాధారాల విశ్లేషన ప్రకారం..ఎయిర్ ఇండియా లిమిటెడ్ 60 ఏళ్లు పైబడిన ఇద్దరు విమాన సిబ్బందితో కలిసి కొన్ని సందర్భాల్లో విమానాలు నడుపుతోంది, ఇది ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 28 Aలోని సబ్ రూల్ (2)ని ఉల్లంఘిస్తోంది. అల్ట్రా-లాంగ్ రేంజ్ (ULR) విమానాలకు ముందు, తర్వాత తగినంత విశ్రాంతి, విమాన సిబ్బందికి లేఓవర్‌లో తగినంత విశ్రాంతి అందించడంలో కూడా ఎయిర్ ఇండియా లోపం ఉన్నట్లు గుర్తించబడింది. దీనికి ముందు, ఫిబ్రవరి 12న ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో 80 ఏళ్ల ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనలో ఎయిరిండియాకు రూ. 30లక్షల జరిమానా విధించారు.