Maruti Suzuki: దేశీయ అగ్రశ్రేణి కార్ మేకర్ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూయల్ పంప్ లోపం కారణంగా 16,000 యూనిట్లకు పైగా కార్లను రీకాల్ చేసింది. జూలై-నవంబర్ మధ్య అమ్ముడైన రెండు మోడళ్ల కార్లను రీకాల్ చేసింది. కార్లలో లోపాల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Moscow Attack : మాస్కో ఉగ్రదాడిపై 15రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చిన అమెరికా
11,851 యూనిట్ల బాలెనో మరియు 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్ మోడల్‌లను రీకాల్ చేయనున్నట్లు మారుతి సుజుకి తెలిపింది. ఫ్యూయల్ పంప్ మోటార్‌లో ఒక భాగంలో లోపం ఉన్నట్లు మారుతి సుజుకి భావిస్తోంది. దీని వల్ల ఇంజన్ ఆగిపోవడానికి లేదా ఇంజన్ స్టార్టింగ్ సమస్యకు దారి తీయొచ్చని మారుతి చెప్పింది. దేశీయంగా కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి అగ్రగామి ఉంది. తక్కవ ధర, ఎక్కవ ఫీచర్ల విషయంలో ఈ సంస్థకు పేరుంది.