BJP 5th List: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారితో బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ కంగనా రనౌత్ బీజేపీ తరుపున పోటీలో దిగనుంది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిన్ గంగోపాధ్యాయ కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు.
Naveen Jindal: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి వరస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్‌కి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హస్తాన్ని వీడారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బీజేపీలో చేరారు. ఆయన గతంలో హర్యానా కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.
Gali Janardhan Reddy: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సొంతూగూటికి తిరిగి వస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన కర్ణాటక రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపించి, గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Chandrayaan-3: గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది.
Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది. 2019లో జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్లో ట్యూషన్ టీచర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది.
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడుతోంది. కీవ్‌తో పాటు పశ్చిమ భాగాన ఉన్న మరో నగరం ఎల్వీవ్పై ఆదివారం తెల్లవారుజామున రష్యా భారీ వైమానిక దాడికి దిగింది. రష్యా క్షిపణుల్లో ఒకటి తమ గగనతలాన్ని ఉల్లంఘించినట్లు పోలాండ్ ఆరోపించింది. బఖ్ముత్కి సమీపంలో ఉన్న గ్రామాన్ని ఆక్రమించుకున్నామని రష్యా సైన్యం చెప్పిర ఒక రోజు తర్వాత ఆదివారం దాడులని మరింత తీవ్రం చేసింది.
Chewing Gum: అమెరికాలోని ఓరెగాన్‌లోని 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందు ‘‘చూయింగ్ గమ్’’ సాయం చేసింది. 1980లో 19 ఏళ్ల బార్బరా టక్కర్ అనే యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేశాడు. ఆమె మృతదేహం క్యాంపస్ పార్కింగ్ స్థలంలో దొరికింది.