Russia: రష్యా స్వలింగ సంపర్కులపై ఉక్కుపాదం మోపుతోంది. సాంప్రదాయేతర లైంగిక సంబంధాలను ప్రోత్సహించడాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించింది. జెండర్‌కి సంబంధించి చట్టపరమైన, వైద్యపరమైన మార్పులను నిషేధించింది. ‘‘LGBT ఉద్యమం’’ని రష్యా తీవ్రవాద, ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. LGBT కార్యకర్తలను తీవ్రవాదులుగా పేర్కొనాలని రష్యా యొక్క సుప్రీం కోర్ట్ గత నవంబర్‌లో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ చర్య జరిగింది. రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి వ్యక్తుల అరెస్టులను, విచారణను ప్రోత్సహిస్తుందని వారు భయపడుతున్నారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక.. అభిమానులు ఈ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేరు..
ఉగ్రవాదుల జాబితాను రోస్పిన్ మోనిటరింగ్ అనే ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇది 14000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల, తీవ్రవాదుల, ఉగ్రసంస్థలుగా గుర్తించబడిన సంస్థల బ్యాంకు ఖాతాను స్తంభింపచేసే అధికారాన్ని కలిగి ఉంది. ఆల్ ఖైదా, యూఎస్ టెక్ దిగ్గజం మెటా, దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ సహచరులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో అంతర్జాతీయ LGBT సామాజిక ఉద్యమం దాని ఇతర యూనిట్లను చేర్చింది.
ఇటీవల రష్యాలో తీవ్ర జనాభా సంక్షోభం ఎదురవుతోంది. ముఖ్యం ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జనాభా తక్కువగా ఉండటం ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతోంది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కుటుంబ విలువలను ప్రోత్సహిస్తున్నారు. మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా స్వలింగ సంపర్కులను నిషేధిస్తూ రష్యా చట్టాలు చేస్తోంది.