Moscow Attack: రష్యా రాజధాని మాస్కోలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 60 మందికి పైగా మరణించారు. ISIS-K ఉగ్ర సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ ధృవీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్(ISIS-K) ఆఫ్ఘనిస్తార్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాల్లోని ఒక ప్రాంతాలకు పాత పదం. ఇది 2014లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత పలు ఉగ్రవాద దాడులతో దీని పేరు మారుమోగింది.
Read Also: Ration Rice Seized: మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టివేత..!
ముఖ్యంగా ఆఫ్ఘాన్‌లో తాలిబన్ అధికారం చేపట్టాక, ఆ దేశంలో ఉగ్రదాడులకు ఈ ఉగ్రసంస్థ కేరాఫ్‌గా మారింది. ఆఫ్ఘాన్ నుంచి యూఎస్ బలగాల నిష్క్రమణ తర్వాత అక్కడ ఈ ఉగ్రసంస్థ భారీ దాడులకు పాల్పడుతోంది. మసీదులతో పాటు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ ఉగ్రదాడులకు పాల్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌లో జరిపిన దాడిలో 100 మంది వరకు చనిపోయారు. సెప్టెంబర్ 2022లో, కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 2021లో కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడి చేసి 13 మంది యూఎస్ సైనికులను చంపింది.
శుక్రవారం మాస్కోపై జరిగిన దాడి అందర్ని ఆశ్చర్యపరిచింది. గత కొంత కాలంగా ఈ గ్రూప్ రష్యా అధినేత పుతిన్‌ని వ్యతిరేకిస్తోంది. ఐఎస్ఐఎస్-కే గత రెండేళ్లుగా రష్యాలో వేళ్లూనుకుంది. ముస్లింలను అణిచివేసే కార్యకలాపాల్లో రష్యా భాగస్వామి ఉన్నట్లు ఈ గ్రూపు భావిస్తోంది. అందుకే తాజాగా మాస్కోపై దాడి చేసినట్లు అంచనా వేస్తున్నారు.