India – Afghanistan: పాకిస్తాన్‌కు భారత్ దెబ్బ.. ఆఫ్ఘాన్ నదిపై డ్యామ్ నిర్మాణానికి మద్దతు.!
- పాకిస్తాన్‌కు భారత్ దెబ్బ..
- ఆఫ్ఘాన్ నదిపై డ్యామ్ నిర్మాణానికి భారత్ మద్దతు..
- ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన ఇండియా..
- కునార్ నదిపై డ్యామ్ నిర్మించే యోచనలో ఆఫ్ఘానిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Afghanistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌తో ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. పాకిస్తాన్‌కు ఈ నదీ జలాలు అత్యంత కీలకం. ఆ దేశ వ్యవసాయం సింధూ దాని ఉప నదులపైనే ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ కూడా భారత దారిలోనే నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కునార్’’ నదిపై డ్యామ్ నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.
ఇటీవల, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్‌జాదా కునార్ నదిపై వీలైనంత త్వరగా ఆనకట్ట నిర్మించాలని ఆదేశించారు. తాలిబాన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ మాట్లాడుతూ.. అఖుంద్‌జాదా విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించడానికి దేశీయ కంపెనీలో ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Namaz In Temple: ముస్లిం యువకుడి అరాచకం.. ఆలయంలో నమాజ్ చేసి అర్చకులకు బెదిరింపులు..!
అయితే, ఇప్పుడు డ్యామ్ నిర్మాణ విషయంలో ఆఫ్ఘానిస్తాన్‌కు భారత్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణానికి భారత మద్దతు ఉంటుందని తెలిపారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఇప్పటికే, భారత్ ఆఫ్ఘనిస్తాన్‌లో పలు డ్యాములను నిర్మించింది. హెరాత్ ప్రావిన్సులో సల్మా ఆనకట్టను నిర్మించింది. ఈ విషయాన్ని కూడా జైస్వాల్ గుర్తు చేశారు. కునార్ నది కాబూల్ నదితో కలిసిన తర్వాత పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తుంది. దీనిని పాకిస్తాన్ లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. ఆ తర్వాత ఇది సింధూ నదిలో కలిసి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబూల్ నదిలో ఎక్కువ నీరు పాకిస్తాన్‌కు చేరుతోంది. ముఖ్యంగా, పాక్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం ఈ నది జలాలతో లాభపడుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!