Venu Goapl Reddy
Author- NTV Telugu-
Sambhal Jama Masjid: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘సంభాల్ జామా మసీద్’’ వివాదం..
Sambhal Jama Masjid: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ సంభాల్ నగరంలో జామా మసీదు అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు.ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. -
Earthquake: జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. 5.8గా తీవ్రత..
Earthquake: గురువారం జమ్మూ కాశ్మీర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా తీవ్రత నమోదైంది. ఒక్కసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్)లో పోస్ట్‌లో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. -
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్ట్‌పై స్పందించిన మాజీ పీఎం షేక్ హసీనా..
Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్‌కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్‌కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు. -
Japanese Encephalitis: 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో నమోదైన ప్రాణాంతక వ్యాధి..
Japanese Encephalitis: అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్లలో ‘‘జననీస్ ఎన్సెఫాలిటిస్)(JE)’’ ఒకటి. సాధారణంగా ‘‘మెదడు వాపు’’ వ్యాధిగా పిలిచే ఈ ప్రాణాంతకమైన వ్యాధి 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కనిపించింది. దశాబ్ధం తర్వాత మొదటి కేసు నమోదైనట్లు మున్సిపల్ ఆరోగ్య విభాగం గురువారం వెల్లడించింది.పశ్చిమ ఢిల్లీలోని బిందాపూర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. నవంబర్ 3న ఛాతీ నొప్పి రావడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. -
Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది. -
Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు. -
China: చైనా అత్యున్నత మిలిటరీ జనరల్ సస్పెండ్.. పీఎల్ఏలో విస్తరిస్తున్న అవినీతి..
China: పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ), చైనా మిలిటరీలో అవినీతి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పలువురు ముఖ్య మిలిటరీ అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. జిన్ పింగ్ అధికారంలో పలువురు ఉన్నతాధికారుల జాడ ఇప్పటికీ తెలియదు. -
Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్‌లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది. -
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవి కాలం పొడగించిన పార్లమెంట్..
Waqf Bill: వక్ఫ్ (సవరణ) బిల్లుపై జాయంత్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడగిస్తూ లోక్‌సభలో గురువారం తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్‌భలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు. -
Sambhal violence: సంభాల్ హింసలో సంచలన విషయాలు.. ఆడియోలో ఆయుధాలు తేవాలని ఆదేశం..
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్‌లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!