2024 Maruti Suzuki Swift: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ వచ్చేసిందోచ్.. ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు.. 25 కి.మీ మైలేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 Maruti Suzuki Swift: మారుతి సుజుకి నుంచి ఫోర్ట్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ కారు ఈ రోజు లాంచ్ అయింది. మరిన్ని టెక్ ఫీచర్లు, సేఫ్టీతో కొత్త స్విఫ్ట్ మార్కెట్‌లోకి వచ్చింది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ కారును మారుతి సుజుకి రంగంలోకి దించింది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.64 లక్షల(ఎక్స్-షోరూమ్)గా ఉంది. నెలకు రూ. 17,436 ధరతో ఈ వాహనాన్ని సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన కూడా పొందవచ్చు. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది గరిష్టంగా 82PS శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMTతో ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్లను కలిగి ఉంది.
ఫోర్త్ జనరేషన్‌గా వచ్చిన ఈ మోడల్ ఇంధన మైలేజ్ పెరిగింది. 5-స్పీడ్ MT వెర్షన్‌కు లీటర్‌కి 24.8 కి.మీ., 5-స్పీడ్ AMT వెర్షన్‌కి 25.75 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మొత్తం ఐదు వేరియంట్లలో కొత్త స్విఫ్ట్ అందుబాటులో ఉంది. LXi, VXi, VXi(O), ZXi మరియు ZXi+ వేరియంట్లను కలిగి ఉంది. మారుతి ఇప్పటి వరకు దేశంలో 30 లక్షల యూనిట్ల కార్లను విక్రయించింది. మొదటి తరం స్విఫ్ట్ 2005లో విడుదల కాగా, సెకండ్ జనరేషణ్ 2011లో, థర్డ్ జనరేషన్ 2018లో ప్రవేశపెట్టారు.
Also Read
- TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
Read Also: Kota: కోటాలో ఓ విద్యార్థి మిస్సింగ్.. ఐదేళ్లపాటు ఇంటికి దూరంగా వెళ్తున్నట్లు మెస్సెజ్
గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా కారు రూపుదిద్దుకుంది. LED DRLలతో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. వెనకవైపు LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కారు ముందు వెనక బంపర్ రీడిజైన్ చేయబడ్డాయి. 15 ఇంచ్ ప్రెసిషన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4.2 ఇంచ్ MIDతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు Arkamys సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 40 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.
భద్రత విషయంలో ఈసారి మారుతి మరింత దృఢంగా వ్యవహరించింది. 45 శాతం హై టెన్సైల్ స్టీల్, 20 శాతం ఆల్ట్రా హై టెన్సైల్ స్టీల్ ఉపయోగించారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. త్రీ పాయింట్ సీట్ బెల్ట్, లక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBD మరియు హిల్‌తో కూడిన ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మాత్రమే కాకుండా, టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మైక్రో ఎస్‌యూవీలకు పోటీ ఇస్తుంది.
వేరియంట్ వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు (ఎక్స్-షోరూమ్):
2024 స్విఫ్ట్ LXi MT – రూ. 6.49 లక్షలు
2024 స్విఫ్ట్ VXi MT – రూ. 7.29 లక్షలు
2024 స్విఫ్ట్ VXi AMT – రూ. 7.79 లక్షలు
2024 స్విఫ్ట్ VXi (O) MT – రూ. 7.56 లక్షలు
2024 స్విఫ్ట్ VXi (O) AMT – రూ. 8.06 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi MT – రూ. 8.29 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi AMT – రూ. 8.79 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ MT – రూ. 8.99 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ AMT – రూ. 9.49 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ MT డ్యూయల్ టోన్ – రూ. 9.14 లక్షలు
2024 స్విఫ్ట్ ZXi+ AMT డ్యూయల్ టోన్ – రూ. 9.64 లక్షలు
తాజావార్తలు
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
-
Passport New Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనలు, ఫీజుల్లో మార్పులు.. కొత్త ఛార్జీలు ఇవే
-
Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?