Allahabad High Court: వివాహం తర్వాత “లివ్-ఇన్ రిలేషన్షిప్”ని ఇస్లాం అనుమతించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: వివాహం జరిగి, జీవిత భాగస్వామి బతికి ఉన్న సమయంలో ఇస్లాం మతాన్ని అనుసరించేవారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంజ్ పేర్కొంది. ఇస్లామిక్ సిద్ధాంతాలు వివాహ సమయంలో సహజీవనాన్ని అనుమతించదని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు అవివాహితులై, మేజర్లు అయిన పక్షంలో తమ జీవితాలను తాము అనుకున్న విధంగా ఎంచుకునే హక్కు ఉందని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ ఏకే శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం బహ్రైన్ జిల్లాకు చెందిన పిటిషన్లు స్నేహాదేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్లకు పోలీసు రక్షణ కల్పించడానికి నిరాకరించింది.
Also Read
- INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
- Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
అయితే, పిటిషనర్లు ఇద్దరూ తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పిటిషన్లు తామిద్దరం పెద్దవాళ్లమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లివ్ ఇన్ రిలేషన్లో ఉండేందుకు తమకు స్వేచ్ఛ ఉందని పోలీసు రక్షణ కోరారు.
ఇదిలా ఉంటే విచారణలో, షాదాబ్ ఖాన్‌కి 2020లో ఫరీదా ఖాటూన్తో పెల్లైనట్లు తేలింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు కోర్టు గుర్తించింది. ఇస్లాం మతం అలాంటి సంబంధాన్ని అనుమతించదని, ముఖ్యంగా భార్య జీవించి ఉన్న సమయంలో అని పేర్కొంది. వివాహ విషయంలో రాజ్యాంగ నైతికత, సామాజిక నైతికత సమాతూకంగా ఉండాలని, లేని పక్షంలో సమాజంలో శాంతి, శాంతిని సాధించే సామాజిక సమన్వయం మసకబారుతుందని చెప్పింది. పిటిషనర్ స్నేహదేవీని భద్రతతో ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపాలని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!