Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bombay High Court: రాజకీయ పార్టీలకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేదు.. అక్రమ హోర్డింగులపై ఫైర్..
Bombay High Court: రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే హోర్డింగులపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలపై వారికి ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయం, జస్టిస్ అమిత్ బోర్కర్లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర అంతటా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై వేసిన పిటిషన్‌ని విచారించింది. -
Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్‌కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!
Betting App: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడికి చెందిన వ్యక్తిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి. -
Monkeypox: మంకీపాక్స్ కలకలం.. కేరళలో ఇద్దరికి పాజిటివ్..
Monkeypox: కేరళలో ఇద్దరికి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ఇద్దరు కూడా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి ఇటీవల కేరళకు తిరగి వచ్చారు. ఇద్దరు వ్యక్తులను పరీక్షించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని ఆమె చెప్పారు. వయనాడ్ జిల్లాకు చెందిన వారిలో ఒకరికి మొదటగా వ్యాధి సోకినట్లు గుర్తించగా, కన్నూర్‌కి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. Read Also: Bandi Sanjay: రూ.224 కోట్ల సీఆర్ఐఎఫ్ […] -
India-China: చైనా వైస్ ప్రెసిడెంట్‌తో అజిత్ దోవల్ భేటీ..
India-China: భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకురావడానికి రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు. -
Doklam issue: డోక్లాం సమీపంలో గ్రామాలను నిర్మిస్తోన్న చైనా..
Doklam issue: మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది. -
BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?
BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..
Mallikarjun Kharge: రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని అవమానించారని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు అంబేద్కర్ ఫోటోలతో నిరసన తెలిపారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
Mumbai: 30 మందితో వెళ్తున్న ఫెర్రీ బోల్తా.. కొనసాగుతున్న రెస్క్యూ..
Mumbai: ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులను రక్షించి మరోక బోటులోకి తీసుకువస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పడవ సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతుండటం వీడియోలో చూడవచ్చు. -
India-North Korea: “కిమ్” రాజ్యంతో దౌత్య సంబంధాలు.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్న భారత్..
India-North Korea: భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా తూర్పు దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటోంది. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కిమ్ జోంగ్ ఉన్’’ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలోని భారత తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచింది. -
Rahul Gandhi: అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..
Rahul Gandhi: రాజ్యసభలో అమిత్ షా చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్పీచ్‌లోని కొంత భాగాన్ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తం చర్చను చూస్తే అమిత్ షా ఏం చెప్పారో అర్థమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!