Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ
Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత నుంచి 30 టీములతో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”.. చికిత్సకు ఎంత డబ్బు ఇచ్చిందంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిదాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడిచి సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై ఆరో చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఆయన వెన్నుముకలో […] -
Donald Trump: ట్రంప్ అధ్యక్షుడైన తొలి రోజే.. టాప్-10 కీలక ఆదేశాలు..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఆయన గద్దెనెక్కబోతున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టాప్-10 ఆదేశాలు ఇవ్వబోతున్నారు. గతంలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కేవలం అప్పటి ఒబామా కేర్ని లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేవారు. ఈ సారి మాత్రం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 1) అక్రమ వలసదారుల […] -
Aero India Show: ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతంలో మాంసం షాపులు, హోటళ్లు బంద్.. కారణం..?
Aero India Show: ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు బెంగళూర్ శివారులోని యలహంకలో జరుగనున్నాయి. ఎరో ఇండియా షో దృష్ట్యా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు యలహంక వైమానిక దళ స్టేషన్ నుంచి 13 కి.మీ పరిధిలో అన్ని మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లను మూసేయాలని బెంగళూర్ నగరపాలక సంస్థ శనివారం ఆదేశించింది. -
Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై బీజేపీ దాడి.. ఆప్ ఆరోపణలు..
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది. -
S Jaishankar: ‘‘ పాకిస్తాన్ ఆ క్యాన్సర్‌కే బలవుతోంది’’: జైశంకర్
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో తీవ్రవాదం గురించి వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదమే క్యాన్సర్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలనే తినేస్తోందని అన్నారు. ముంబైలోని 19వ నాని ఏ పాల్ఖివాలా స్మారక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత దశాబ్ధ కాలంగా భారతదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి చెప్పారు. -
Kolkata Doctor Case: ‘‘ ఒక్కరు కాదు, నలుగురు నిందితులు’’.. ట్రైనీ డాక్టర్ తండ్రి సంచలన ఆరోపణ..
Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఈ రోజు సీల్దా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని దోషిగా తేల్చింది. హత్య, అత్యాచారం సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది. సోమవారం ఈ శిక్షలను విధించనుంది. గతేడాది ఆగస్టులో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న సమయంలోనే వైద్యురాలిపై పాశవికంగా హత్యాచారం జరిగింది. -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో అనుమానితుడు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. -
Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్” దాడి ప్రారంభం..
Donald Trump: అమెరికాకు 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు హాజరవుతున్నాయి. ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ట్రంప్ యాక్షన్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘ఇమ్మిగ్రేషన్’’పై దృష్టి పెడుతున్నట్లు సమచారం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని అణిచివేసే పెద్ద ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. Read Also: Minister Ravikumar: ఏపీలో 9 గంటల ఉచిత […]
తాజావార్తలు
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!