Kia EV3: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా తన EV3 కారును రివీల్ చేసింది. కియా నుంచి ఇప్పటికే EV6, EV9 మరియు EV5 ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది. నాలుగో మోడల్‌గా EV3 రాబోతోంది. ఇటీవల ‘2024 వరల్డ్ కాప్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్న EV9 డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది EV3ని రూపొందించనట్లు కియా చెబుతోంది. ఈ కారు డైమెన్షన్స్‌ని పరిశీలిస్తే 4,300mm పొడవు, 1,850mm వెడల్పు మరియు 1,560mm ఎత్తు, వీల్‌బేస్ 2,680 mm ఉంటుంది. చెప్పాలంటే కియా సెల్టోస్ వాహనం పరిమాణంలో ఉంటుంది.
టెక్ లోడెడ్ ఫీచర్లు, స్టన్నింగ్ స్టైలిష్ లుక్స్‌తో ఈ కారు రాబోతోంది. EV9 లాగే EV3 కూడా ఇంటరీయర్స్ చాలా అధునాతనంగా ఉండబోతున్నాయి. రెండు 12.3-అంగుళాల డిస్‌ప్లేలను ఉంటాయి. సెంట్రల్ ఆర్మ్ రెస్ట్‌తో పాటు సీట్లు రిక్లైన్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. EV3కి 12-అంగుళాల HUD, యాంబియంట్ లైటింగ్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, ADAS ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతో పాటు AI అసిస్టెంట్ కలిగి ఉన్న తొలి కియా కారుగా ఉండబోతోంది.
Read Also: Suresh Raina: పాక్ జర్నలిస్ట్ కు ‘రైనా’ దెబ్బ అదుర్స్.. దెబ్బకి నోరు మూయించాడుగా..
కియా EV3 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. 58.3kWh మరియు 81.4kWh బ్యాటరీ ప్యాక్స్‌ని కలిగి ఉంటుంది. రెండు వెర్షనల్లో ముందు వైపు మోటార్ ఉంటుంది. ఇది 201 బీహెచ్‌పీ పవర్‌తో 283 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తూ పవర్ ఫుల్‌గా ఉంది. ఇది 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 7.5 సెకన్లలో అందుకోగలదు. లాంగ్ రేంజ్ వెహికిత్ ఒక్క ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 600 కి.మీ రేంజ్ ఇస్తుంది. 400V ఆర్కిటెక్చర్ ఆధారంగా బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 31 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కియా పేర్కొంది. అయితే, భారత్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, కొత్త కార్నివాల్, EV9 లాంచ్ తర్వాత వచ్చే ఏడాది తర్వాత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు.