Puri temple Row: పూరీ జగన్నాథ ఆలయం ప్రస్తుతం ఎన్నికల వార్తల్లో నిలుస్తోంది. పూరీ జగన్నాథుడి ఆలయంలో రత్నబండార్ తాళాలపై ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఒడిశాలో అధికార నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ, బీజేపీకి మధ్య విమర్శలకు కారణమైంది. ప్రస్తుతం ఈ వివాదంలోకి తమిళనాడు కూడా వచ్చి చేరింది. ఇటీవల తప్పిపోయిన రత్న బండార్ తాళాలు తమిళనాడులో ఉన్నాయని ప్రధాని ప్రకటన చేశారు. బీజేడీ పార్టీలో నవీన్ పట్నాయక్ వారసుడిగా చెబుతున్న వీకే పాండియన్‌ని ఉద్దేశిస్తూ ఆరేళ్ల క్రితం ఈ తాళాలు తమిళనాడు చేరుకున్నాయని అన్నారు.
Read Also: Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
అయితే, ఈ వ్యాఖ్యలు బీజేపీ, తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలకు వచ్చాయి. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కే. సెల్వపెరుంతగైం ప్రకటించారు. దీనిపై బీజేపీ చీఫ్ అన్నామలై స్పందిస్తూ.. ‘‘తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించబోతున్నామని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారని విన్నాను. మా కార్యాలయం వచ్చే తేదీని ముందుగానే ప్రకటిస్తే సౌకర్యంగా ఉంటుంది. వచ్చే పదిమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. దీంతో పాటు తమిళులకు డీఎంకే, కాంగ్రెస్ చేసిన ద్రోహంపై ఓ పుస్తకాన్ని కూడా వారందరికీ బహుమతిగా ఇస్తాం అని చెప్పారు.
అన్నామలై వ్యాఖ్యలపై స్పందించిన ఇళంగోవన్, రెండు రోజుల ముందే తాము తేదీని ప్రకటిస్తామని, అయితే తమకు మాంసాహారం, గొడ్డుమాంస కావాలని డిమాండ్ చేశారు. ‘‘మేము అక్కడికి వస్తే, మాకు మాంసాహారం మరియు గొడ్డు మాంసం అవసరం. మేము రెండు రోజుల ముందు తెలియజేస్తాము. ఆయనను అన్ని సౌకర్యాలు చేయనివ్వండి’’ అంటూ ఇలంగోవన్ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై డీఎంకే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రజల్ని దొంగలుగా అభివర్ణిస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్దారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై మాట్లాడుతూ.. స్టాలిన్‌కి సలహాలు ఇచ్చేవారు వాస్తవాలు చెప్పడం లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే పోయిన తాళాలు దొరుకుతాయని మాత్రమే ప్రధాని వ్యాఖ్యానించారని చెప్పారు.