Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తనే భార్యను కడతేర్చాడు. ఈ దారుణహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి ఏరియాలో నివాసం నాగేంద్ర భరద్వాజ తన భార్య మధులతను దారుణంగా హతమార్చాడు. మధులత తలపై సుత్తెతో మోడి కత్తితో మెడపై పొడిచి హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా కోసేందుకు ప్రయత్నించాడు. గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ నెల 4న మధులతను హత్య జరిగింది. బాధిత మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నిందితుడైన నాగేంద్రని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Earth-Sized Planet: 40 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహం..జీవానికి ఛాన్స్..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసిన రిమాండ్‌కి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు నిందితుడు నాగేంద్ర రిమాండులో ఉన్నట్లు సీఐ తెలిపారు.
వరకట్న వేధింపుల వల్లే తమ కూతురిని అల్లుడు భరద్వాజ్ క్రూరంగా హత్య చేశాడని మధులత తల్లిదండ్రులు ఆరోపించారు. డబ్బులు తెమ్మని నా కూతురిని వేధించేవాడని, పలుమార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. 2020లో వీరికి వివాహం జరిగిందని మధులత తల్లిదండ్రులు చెప్పారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తన కుమార్తెను భరద్వాజ్‌తో పాటు ఆమె అత్తమామలు కూడా కొట్టేవారని, తాము బాచుపల్లి పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిని చంపాడని, నిందితుడిని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!