Venu Goapl Reddy
Author- NTV Telugu-
India Bangladesh: ‘‘భారత భూభాగాలను కలుపుకుంటాం’’.. బంగ్లాదేశ్ నేత వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్‌ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్‌లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్ చేశాడు. -
Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
Kerala High Court: ఆసుపత్రులు "ఆధునిక సమాజంలోని దేవాలయాలు" అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. -
Violence against Hindus: పాకిస్తాన్లో కన్నా బంగ్లాదేశ్‌లోనే హిందువులపై ఎక్కువ దాడులు..
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్‌లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. -
Divorce Case: “బిడ్డకు పేరు పెట్టే విషయంలో గొడవ”.. పిల్లాడికి కోర్టు ఏం పేరు పెట్టిందో తెలుసా..
Divorce Case: బిడ్డకు పేరు పెట్టే విషయంపై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు విడాకులు వరకు వెళ్లింది. తమ బిడ్డకు పేరు పెట్టడంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై దంపతులు విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 2021లో జన్మించిన తన కుమారుడి పేరు పెట్టే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వివాదం మొదలైంది. -
MH370 Plane: తప్పిపోయిన మలేషియా విమానం కోసం మళ్లీ సెర్చింగ్.. 10 ఏళ్లలో ఏం తేలింది..?
MH370 Plane: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు. -
Google Layoffs: 10 శాతం ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్..
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను ప్రకటించారు. -
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాలు నడుపుకుంటున్నారు..
Yogi Adityanath: మొఘల్ పాలకుడు ఔరంగజేబు, అతని వారసులను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులు ఇప్పుడు కలకత్తా సమీపంలో నివసిస్తున్నారని, జీవించడానికి రిక్షాలు నడుపుకుంటూ బతుకుతున్నారని అన్నారు. ‘‘ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయం’’గా అభివర్ణించారు. ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు. Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్ […] -
Atul Subhash Case: మనవడి కోసం సుప్రీంకోర్టుకి అతుల్ సుభాష్ తల్లి..
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
Bangladesh: పాకిస్తాన్‌తో పెరుగుతున్న బంగ్లాదేశ్ స్నేహం..
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తానున పాకిస్తాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్‌కి ఇబ్బందికలిగించేలా మారింది. -
Cars24 CEO: కన్నడ మాట్లాడటం రాదా? ఢిల్లీకి రండి.. రచ్చకు దారి తీసిన పోస్ట్..
Cars24 CEO: కన్నడ అంటే ఆ కర్ణాటకలోని ప్రజలకు ఎంత అభిమానమో అందరికి తెలుసు. అయితే, ఇది ఇటీవల కాలంలో దురభిమానంగా మారుతోంది. వేరే ప్రాంతాల నుంచి బెంగళూర్, ఇతర కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసే వారు తప్పకుండా కన్నడ మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నడ మాట్లాడని వారిపై దాడులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!