Sanjay Kumar Verma: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత సంబంధాల్లో తీవ్రమైన దౌత్యవివాదానికి కారణమైంది. అయితే, ఈ హత్యలో భారత సీనియర్ దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందని సాక్ష్యాత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలతో భారత్ తీవ్రంగా స్పందిస్తూ.. మన దౌత్యవేత్తలు ఆరుగురిని రీకాల్ చేసింది. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, తాజాగా ఇండియాకి వచ్చిన దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ సంచలన విషయాలను వెల్లడించారు. కెనడా పోలీసులు, ఆర్మీలో ఖలిస్తాన్ అనుకూల ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాడు. పార్లమెంట్‌లో కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించారు. కెనడాలో పీఎం జస్టిన్ ట్రూడో ప్రజామోదం పడిపోయిందని చెప్పాడు. ట్రూడో ప్రభుత్వంలో చాలా మంది భారత వ్యతిరేకులే అని చెప్పారు.
Read Also: Asaduddin Owaisi: చైనా- భారత్ మధ్య ఒప్పందంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
కెనడాలోని భారతీయ విద్యార్థులను కూడా ఈ ఖలిస్తానీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. భారత విద్యార్థుల్ని ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా రాడికలైజ్ చేయడానికి చూస్తున్నారని, వీటిని అడ్డుకోవాలని చెప్పారు. కెనడాలోని విద్యార్థుల తల్లిదండ్రులు వారితో క్రమం తప్పుకుండా మాట్లాడాలని, వారి పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. కెనడాలో జాబ్స్, డబ్బుతో మన స్టూడెంట్స్‌కి ఎర వేస్తున్నారని, దీంతో వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులు ప్రభావితం చేస్తు్న్నారని చెప్పారు.
కొందరు విద్యార్థుల్ని, భారతదేశ దౌత్య కార్యాలయాల ముందు భారతదేశానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, నినాదాలు చేసేలా ప్రేరేపించబడ్డారని వర్మ చెప్పారు. ఇలా చేయడం వల్ల భారత్ వెళ్తే శిక్షిస్తారని, దీంతో కెనడాలో ఆశ్రయం పొందొచ్చని కొందరు విద్యార్థులు ఇలా చేస్తున్నారని చెప్పారు.