Bomb Threats To Flights: గత 10 రోజలుగా భారత విమానయాన రంగాన్ని నకిలీ బాంబు కాల్స్, మెసేజులు కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాసా ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Read Also: BJP: కాంగ్రెస్ ఖర్గేని అవమానించింది.. సోనియా, రాహుల్‌పై బీజేపీ ఫైర్..
గత 11 రోజుల్లో దాదాపుగా 250 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్లైట్ ఆపరేషన్స్ దెబ్బతింటున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల విమాన సంస్థలు కోట్లల్లో నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఇంధనాన్ని డంప్ చేయడం, రూట్ మార్చడం వంటి చర్యల వల్ల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ వారం ప్రారంభంలో కేంద్ర పౌరవిమానయాన శకా మంత్రి కే రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్టులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పాడు. దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే దానిపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.