Justice Sanjiv Khanna: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నియమించారు. ఎక్స్ వేదికగా ఈ ప్రకటనను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ విడుదల చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఖన్నా ఉన్నారు. ప్రస్తుత సీజేఐ DY చంద్రచూడ్ స్థానంలో కొత్త న్యాయమూర్తి నవంబర్ 11,2024న బాధ్యతలు స్వీకరిస్తారు. అక్టోబర్ 18, 2024న DY చంద్రచూడ్ చేసిన సిఫార్సును అనుసరించి ఈ నియామకం జరిగింది. DY చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు.