Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Rohith: ఒకప్పుడు వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. అయితే గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉండిపోయారు. కెరీర్ ఆరంభంలోనే భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన, వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడ్డారు. 2018 తర్వాత ఆయన సినిమాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో, మళ్లీ హీరోగా కనిపిస్తారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టిగానే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 2024లో విడుదలైన ‘ప్రతినిధి 2’తో ఆయన మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడినప్పటికి, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ నారా రోహిత్ వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే, ఈసారి బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది.
అందులో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నారా రోహిత్ కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ఆయన కెరీర్‌కు కీలక మలుపు కావచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మరోవైపు ‘సౌండ్ ఇంజనీర్’ సినిమాలో నారా రోహిత్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించిన ఆయన, ఈ చిత్రంలో వినోదాత్మక శైలిలో ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఆయనలోని మరో కోణాన్ని అభిమానులు చూడబోతున్నారు.
Also Read
అలాగే ‘కపాలి’ అనే థ్రిల్లర్ కూడా ఆయన లైనప్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మూవీలో మరోసారి పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న నారా రోహిత్, యాక్షన్‌తో పాటు సస్పెన్స్‌కు ప్రాధాన్యమున్న కథలో కనిపించనున్నారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లను ఒకేసారి ఎంచుకోవడం ద్వారా తనలోని నటుడిని మరోసారి నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే వ్యూహంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాలు సాధిస్తే, నారా రోహిత్ మరోసారి టాలీవుడ్లో బలమైన స్థానాన్ని సంపాదించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే, ఈసారి గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టే కనిపిస్తోంది.
- Tags
- cinema
- Nara Rohith
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!