మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
PFI:నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)తో సంబంధాలున్నాయంటూ 2022లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్ల ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ ఎంపీ సీటు నుంచి భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేష్, కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు.
Murder for property: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్‌లో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన దారుణమై కుట్ర వెలుగులోకి వచ్చింది.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
China: భారత్-చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ తెలిపింది. మూడోసారి ఎన్నికైన ప్రధాని నరేంద్రమోడీకి చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అభినందనలు తెలియజేశారు.
Pakistan: జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఆదివారం టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఒక్కసారిగా బస్సులోయలో పడిపోయింది.