Jammu Kashmir: ఇంటింటికి వెళ్లి నీరు అడిగిన ఉగ్రవాదులు.. కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హతం..
- కథువా ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది హతం..
- నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆపరేషన్..
- రియాసి ఘటన జరిగి తర్వాత వరసగా ఉగ్రదాడులు..
- జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా విస్తృత గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు. ఇది మరవక ముందే కథువాలో మంగళవారం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికి వెళ్లి నీరు అడగటంతో అనుమానించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. కథను ఇబ్బంది పెట్టకూడదు: ఏవమ్ దర్శకుడి interview
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
నిన్న సాయంత్రం భద్రతా అధికారులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కతువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్రయత్నించిన రెండో ఉగ్రవాది ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌ని చంపాడు. హతమైన రెండో ఉగ్రవాది దగ్గర యూఎస్ తయారీ ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దోడాలో ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు, ఎస్పీఓ గాయపడ్డారు.
అంతకుముందు, ఆదివారం రోజున జమ్మూలో కత్రా నుంచి శివఖోరీ ఆలయానికి యాత్రికులు వెళ్తున్న సమయంలో బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 10 మంది మరణించారు. లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జా ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీంలు గాలింపు చేపడుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!