Death sentence: అత్తగారిని దారుణంగా 95 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన 24 ఏళ్ల యువతికి మధ్యప్రదేశ్ రేవా జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. జిల్లాలోని అత్రైలా గ్రామానికి చెందిన కంచన్ కోల్, ఆమె 50 ఏళ్ల అత్త సరోజ్ కోల్‌ను హత్య చేసిన కేసును విచారించిన రేవా అదనపు సెషన్స్ జడ్జి పద్మా జాతవ్ కంచన్‌ని దోషిగా నిర్ధారించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వికాస్ ద్వివేది తెలిపారు.
Read Also: Murder for property: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామని చంపేందుకు కోడలు ఎలా ప్లాన్ చేసిందంటే..
రెండేళ్ల క్రితం అంటే 2022 జులై 12న అట్రైలా గ్రామంలో కంచన్ తన అత్తగారిని 95 సార్లు పదునైన కొడవలితో కొట్టి దారుణంగా హతమార్చింది. ఘటన సమయంలో అత్తగారు ఒక్కరే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె కుమారుడు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు చెప్పారు. ఈ కేసులో బాధితురాలి సరోజ్ కోల్ భర్త వాల్మికీ కోల్‌ని కూడా సహ నిందితుడిగా చేర్చారు. అయితే, సాక్ష్యాలు లేకపోవడంతో అతడిని నిర్దోషిగా విడుదల చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.