Murder for property: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామని చంపేందుకు కోడలు ఎలా ప్లాన్ చేసిందంటే..
- ఆస్తి కోసం మామని హత్య చేసిన కోడలు..
- పక్కా ప్లాన్‌తో కుట్ర..
- రూ. 300 కోట్ల ఆస్తిపై కన్ను..
- విచారణలో విస్తూపోయే నిజాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder for property: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్‌లో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన దారుణమై కుట్ర వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అర్చన మనీష్ పుట్టేవార్ గత వారం 82 ఏళ్ల తన మామా పురుషోత్తం పుట్టేవార్‌ని ప్లాన్ చేసి హతమార్చింది. 15 రోజుల క్రితం పురుషోత్తం కారు ఢీకొట్టడంతో మరణించారు. ఈ కేసును లోతుగా పరిశీలించిన పోలీసులకు నిజాలు వెలికి తీశారు. నిందితురాలైన అర్చనాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1 కోటి సుపారీగా ఇచ్చి ఆమె హత్య కోసం వ్యక్తుల్ని నియమించుకుంది.
Read Also: Andhra pradesh: ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..(వీడియో)
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
అర్చన తన మామను చంపేందుకు నిందితులకు కారు కొనేందుకు డబ్బులు కూడా ఇచ్చింది. కారు ఢీకొట్టడాన్ని ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పురుషోత్తంకి సంబంధించిన రూ. 300 కోట్ల విలువైన ఆస్తులపై తన పట్టును సాధించేందుకు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. 53 ఏళ్ల మహిళ తన భర్త డ్రైవర్ అయిన బాగ్డేతో పాటు ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌లతో కలిసి హత్యకు పథకం వేసిందిన పోలీసులు తెలిపారు. పోలీసులు హత్యతో పాటు మోటార్ వాహనాల చట్టంలోని ఇతర సెక్షన్ల కింది అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన రోజున సర్జరీ అయి కోలుకుంటున్న తన భార్య శకుంతలను కలిసేందుకు పురుషోత్తం పుట్టేవారు ఆస్పత్రికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తిరిగి వస్తున్న క్రమంలో కారు అతడి పైనుంచి దూకుకెళ్లింది.పురుషోత్తం కుమారుడు, అర్చన భర్త మనీష్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ హత్య విచారణ సమయంలోనే అర్చనా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను కనుగొన్నారు. అయితే, ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విచారణలో తేలింది. నిబంధనలను ఉల్లంఘించిన అక్రమ లేఅవుట్లను క్లియర్ చేశారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..