Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్ల ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ ఎంపీ సీటు నుంచి భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేష్, కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ కూడా ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అఖిలేష్ తన రాజీనామా లేఖని శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే కార్యాలయాలని పంపారు.
Read Also: Death sentence: అత్తని 95 సార్లు పొడిచి చంపిన మహిళ.. మరణశిక్ష విధించిన కోర్టు..
అఖిలేష్ 2022 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కర్హాల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తదుపరి ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పార్టీకి మేలు జరిగేలా, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ సత్తా చాటింది. బీజేపీకి గత రెండు ఎన్నికల్లో కంచుకోటగా ఉన్న యూపీని అఖిలేష్ బద్ధలు కొట్టారు. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో మాజ్‌వాదీ పార్టీ 37, బీజేపీ 33, కాంగ్రెస్ 6, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), అప్నా దళ్ (సోనీలాల్) ఒక్కో సీటుగెలుచుకున్నాయి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో కూడా బీజేపీ ఓటమి పాలైంది. ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి అవదేశ్ గెలుపొందారు.