Venu Goapl Reddy
Author- NTV Telugu-
Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్‌కి ఏక్నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు. -
Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ విరుచుకుపడుతోంది. చైనా దళాలు భారతదేశంలోకి చొచ్చుకువచ్చాయని, ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఆహ్వానం కోసం ప్రధాని మోడీ, జైశంకర్‌ని యూఎస్‌కి పంపించారంటూ సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం వివాదాస్పదమైంది. -
Tamil Nadu: “స్కంధమలై”ని “సికిందర్ మలై”గా మార్చాలి.. కుమారస్వామి ఆలయంపై వివాదం..
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. -
Indian Nationals Deported: 205 మంది భారతీయుల్ని బహిష్కరించిన ట్రంప్.. టెక్సాస్ నుంచి ఇంటికి….
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా. -
Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ..
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్… -
Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..
Hezbollah: గతేడాది సెప్టెంబర్ నెలలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హతమైన హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 23న అంత్యక్రియలు జరుగుతాయని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా ప్రస్తుతం చీఫ్ నయీమ్ కస్సేమ్ ఆదివారం తెలిపారు. లెబనాన్ బీరూట్‌కి సమీపంలోని ఒక బంకర్‌పై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, నస్రల్లాని హతమార్చింది. -
PM Modi: ‘‘నెహ్రూ టైంలో పావు వంతు, ఇందిరా టైంలో రూ. 10 లక్షల టాక్స్’’..
PM Modi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపుల గురించి మాట్లాడారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో పన్నుల విధానం గురించి విమర్శించారు. నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ. 20 లక్షల జీతం ఉంటే పావు వంతు […] -
T-shirt: రూ. 300 టీ-షర్టు కోసం హత్య..
T-shirt: కేవలం రూ. 300 టీ-షర్టుపై చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో టీ షర్టుపై చెలరేగిన వివాదం స్నేహితుడైన 30 ఏళ్ల వ్యక్తిని హత్య చేయడానికి కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం శాంతి నగర్ ప్రాంతంలో శుభమ్ హర్నే(30) అనే వ్యక్తి , టీ-షర్టు కొనుగోలు చేసిన అక్షయ్ ఆసోల్(26)కి రూ. 300 చెల్లించడానికి నిరాకరించాడు. దీనిని అక్షయ్ ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ఇది […] -
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రధాన పూజారికి ‘‘బ్రెయిన్ స్ట్రోక్’’.. పరిస్థితి విషమం..
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి 85 ఏళ్ల మహంత్ సత్యేంద్ర దాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్‌కి గురయ్యారు. -
Sonia Gandhi: రాష్ట్రపతిపై వ్యాఖ్యల ఫలితం.. సోనియాగాంధీపై ‘‘సభా హక్కుల తీర్మానం’’
Sonia Gandhi: పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
తాజావార్తలు
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!