Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ట్రంప్ చెవిని తాకుతూ బుల్లెట్ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ హతమార్చాయి. హత్యాయత్నం నుంచి తనను కాపాడినందుకు సీక్రెట్ సర్వీస్ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Rape : నెలల పాపపై అత్యాచారం.. కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఇదిలా ఉంటే, మన దేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకువడం నమ్మశక్యం కావడం లేదని ట్రంప్ అన్నారు. ఈ కాల్పుల్లో ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరు మరణించారు. ఈ ఘటనపై రిపబ్లికన్ పార్టీ నేతలు అధ్యక్షుడు జో బైడెన్‌ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాల్పులు దేశంలో ఒకే సంఘటన కాదని రిపబ్లికన్న సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ‘‘ట్రంప్‌ని ఎలాగైనా ఆపాలని, ట్రంప్‌ని ఒక నిరంకుశ ఫాసిస్టుగా అభివర్ణిస్తున్నారని. ఇదే హత్యాయత్నానికి దారి తీసింది’’ అని ఆయన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
రిపబ్లికన్ నాయకుడు మరియు కాంగ్రెస్ మహిళ మార్జోరీ టేలర్ గ్రీన్ మాట్లాడుతూ.. ట్రంప్, అతని మద్దతుదారులు డెమోక్రాట్లు చనిపోవాలని కోరకుంటున్నట్లు ఆరోపించారు. ‘‘ అహింసాయుత యూఎస్ క్యాపిటర్ దాడిలో పాల్గొన్నవారిని జైలులో ఉండేలా ఆయుధాలు పొందిన వారు చేయగలిగినదంతా చేశారు. వారికి ట్రంప్, వారి మద్దతుదారులు మరణించడం కావాలి. దీనిని మరిచిపోము’’ అని ఆమె అన్నారు. ఈ రోజు చిందిన ప్రతీ రక్తపుబొట్టుకు డెమోక్రాట్లు కారణమని అన్నారు. మీడియా, డెమోక్రాట్లు ఏళ్లకు ఏళ్లుగా ట్రంప్ మద్దతుదారుల్ని రాక్షసులుగా చూశారని అన్నారు.