Wedding: చిన్నచిన్న వివాదాల కారణంగా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. వధూవరుల బంధువుల మధ్య వివాదాల కారణంగా మ్యారేజ్‌లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కొబ్బరికాయలు, మాంసాహారం, అతిథి మర్యాదలు ఇలా కాదేది అనర్హం అన్నట్లు, వధూవరులను విడదీస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్‌లో మరో వివాహం క్యాన్సిల్ అయింది. దీనికి కారణం ఏంటంటే, కూలర్ వద్ద అతిథులు కూర్చోవడమే. కూలర్ దగ్గర కూర్చున్నందుకు అతిథులు, పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో వధువు వరుడితో పెళ్లికి నిరాకరించింది.
Read Also: Spicejet employee: వివాదం అవుతున్న జైపూర్ ఎయిర్‌పోర్టు ఘటన.. ఏం జరిగిందంటే..!
వరుడిని పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వధువు కట్టుబడి ఉంది. దీంతో విషయం గ్రామంలోని పంచాయతీకి చేరింది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో ఇరువర్గాల ప్రజలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. సమాచారం ప్రకారం.. చత్బరాగావ్ గ్రామంలో జరిగిన ఈ వివాదం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. పోలీసులు మధ్యవర్తిత్వం వహించి సముదాయించే ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు. చివరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు ఇరు వర్గాలకు రూ. 151 జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు.
ముస్తఫాబాద్‌కు చెందిన వరుడి హుకుమ్ చంద్ జైస్వాల్ వరుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కష్టాలను వివరించిన వరుడు, పెళ్లి క్యాన్సిల్ చేసుకోవద్దదని వధువును ప్రాధేయపడినట్లు చెప్పారు. పెళ్లిలో చిన్నచిన్న గొడవలు జరుగుతాయని ఒప్పించే ప్రయత్నం చేశానని చెప్పాడు. ఇక పెళ్లి వేడుక పూర్తి కావస్తోందని, కూలర్ దగ్గర కూర్చోవడంపై వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు. అతిథులు, పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య గొడవ తనను బలి చేసిందని చెప్పారు. పెళ్లికి ముందే గొడవలు జరగడంతో, అత్తగారింటికి వెళ్తే మళ్లీ ఎన్ని గొడవలు జరుగుతాయో అని వధువు భయపడుతున్నట్లు వెల్లడించారు.
बलिया : कूलर हवा खाने को लेकर बराती-घराती भिड़े
➡दुल्हन को जानकारी होने पर शादी से किया इंकार
➡मनाता रहा दूल्हा पर दुल्हन ने शादी से किया इनकार
➡मौके पर पहुंची पुलिस ने दोनों पक्षों को समझाया
➡नहीं बनी बात बिना दुल्हन के बगैर लौटी बारात
➡चितबडागांव थाने के नगर पंचायत का… pic.twitter.com/h9elKwtzlq— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 13, 2024