Venu Goapl Reddy
Author- NTV Telugu-
Delimitation: “డీలిమిటేషన్”పై దక్షిణాది రాష్ట్రాల భయం ఏమిటి..? నియోజకవర్గాల పునర్విభజపై పూర్తి సమాచారం..
Delimitation: ప్రస్తుతం ‘‘డీలిమిటేషన్’’ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ‘‘జనాభా నియంత్రణ’’ పద్ధతులు పాటించడం ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
Bird Flu: ‘‘సీజనల్ ప్లూ’’, తీవ్రమైన ‘‘బర్డ్ ఫ్లూ’’ నుంచి రక్షణ కల్పించవచ్చు..
Bird Flu: ఇటీవల కాలంలో "బర్డ్ ఫ్లూ" ప్రపంచాన్ని భయపెడుతుంది. H5N1 బర్డ్ ఫ్లూ కేసులు పలు దేశాల్లో నమోదు అయ్యాయి. ముఖ్యంగా మానవుడికి బర్డ్ ఫ్లూ సోకడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాబోయే కాలంలో సంభావ్య ‘‘మహమ్మారి’’గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒక అధ్యయనంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. -
Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
Trump "Gold Card": డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్‌ని ప్రకటించి, మరో సంచలనానికి తెరతీశారు. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్ భారతీయులకు వరంగా ట్రంప్ చెబుతున్నారు. భారతదేశాల నుంచి వచ్చే తెలివైన విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు గోల్డ్ కార్డ్ పనిచేస్తుందని అన్నారు. వారిని నియమించుకునే కంపెనీలు గోల్డ్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా వారిని ఇక్కడే ఉంచొచ్చని ట్రంప్ చెప్పాడు. -
Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
Karnataka: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కారకాలు ఒంట్లోకి చేరుతాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు వ్యాఖ్యలు చేసిన తర్వాత, కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. రాష్ట్రవ్యాప్తంగా 52 హోటళ్లలో ఇడ్లీలు తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని కర్ణాటక ఆహార భద్రతా విభాగం కనుగొన్నట్లు మంత్రి దినేష్ గుండూ రావు గురువారం తెలిపారు. -
Mamata Banerjee: ‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు. -
Time Use Survey: సెల్ఫ్ కేర్ మరిచి, పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్న భారతీయులు,
Shocking Survey: కేంద్రం విడుదల చేసిన టైమ్ యూజ్ సర్వే 2024లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సర్వేలో తేలింది. స్వీయ సంరక్షణ, నిర్వహణపై తక్కువ సమయం గడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సర్వే ప్రకారం.. రోజులో ఉపాధి, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పురుషులు, మహిళలు(15-59 సంవత్సరాలు) పాల్గొనడటం 75 శాతం, 25 శాతానికి పెరిగింది. ఇది 2019లో 70.9 శాతం, 21.8 శాతంగా ఉండేది. -
MK Stalin: ‘‘హిందీ 25 భాషల్ని నాశనం చేసింది’’.. కేంద్రం-తమిళనాడు మధ్య ఆగని గొడవ..
MK Stalin: తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ‘‘హిందీ’’ వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విమర్శిస్తున్నారు. తమ రాష్ట్రంలో తమిళ, ఇంగ్లీష్ కలిగిన ‘‘ద్విభాషా విధానం’’కి ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అయితే, ఎంకే స్టాలిన్ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తోంది. అన్ని భాషల్ని ఇష్టపూర్వకంగా నేర్చుకునే హక్కు అందరికి ఉంటుందని చెబుతోంది. -
USA: రష్యాని చైనా ‘‘జూనియర్ భాగస్వామి’గా ఉండనీయబోము..
USA: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్, రష్యాల మధ్య స్నేహం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలుమార్లు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో ట్రంప్‌కి పొసగడం లేదు. ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్, ట్రంప్ మార్గాలను వెతుకుతున్నారు. -
DK Shivakumar: శశిథరూర్, తాజాగా డీకే శివకుమార్.. కాంగ్రెస్‌లో కలకలం..
DK Shivakumar: కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది. హస్తం పార్టీలో ఎంపీ శశిథరూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు కలకలం రేపుతున్నారు. వీరిద్దరు బీజేపీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇషాఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు నిర్వహించిన మహాశివరాత్రి కార్యక్రమానికి డీకే శివకుమార్ వెళ్లడంపై సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు ఈయన ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లడం కూడా వివాదాస్పదమైంది. -
Pune Rape Case: సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..
Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్‌స్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!