Himanta Biswa Sarma: బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల చొరబాట్లు దేశ జనాభాకు ముప్పుగా పేర్కొన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈ చొరబాట్లను అడ్డుకోవడంతో జార్ఖండ్, బెంగాల్ ప్రభుత్వాలు మెతక వైఖరిని అవలంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరబాట్లను అడ్డుకునేందుకు బలహీనంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇది జనాభాకు ముప్పుగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసన సమయంలో ‘‘బెంగాల్ తరుపులు తెరిచి ఉన్నాయి’’ అని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన ప్రస్తావించారు. రోహింగ్యాల సమస్యని కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని అన్నారు.
Read Also: Man Kills Wife: అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..
బుధవారం గౌహతిలో విలేకరులతో మాట్లాడుతూ.. రోహింగ్యాలు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారు. రోహింగ్యాలను అడ్డుకోవడంలో అస్సాం, త్రిపుర సర్కార్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. అస్సాం ఇకపై అక్రమ వలసదారులకు సురక్షితంగా, స్వర్గధామంగా ఉండబోదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పరిస్థితిని నియంత్రించామని చెప్పారు. కానీ బెంగాల్, జార్ఖండ్ ఈ సమస్యపై మౌనంగా ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడకుంటే వాటిని నియంత్రించొచ్చని హితవు పలికారు. రోహింగ్యాలపై సాఫ్ట్ పాలసీ పనిచేయదని, మనం దానిని ఆపకుంటే, మొత్తం దేశం జనాభా దండయాత్రని ఎదుర్కొంటుందని చెప్పారు.