Mohammed Deif: హమాస్ కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేసి మరీ లేపేస్తోంది ఇజ్రాయిల్. ఇరాన్ టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్‌గా ఉన్న మహ్మద్ దీఫ్‌ని హతమార్చినట్లు ప్రకటించింది. అయితే, హనియే హత్యలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయిల్ చెప్పింది. మహ్మద్ దీఫ్ విషయంలో మాత్రం అలా కాకుండా గత నెలలో తాము చేసిన గాజా వైమానిక దాడిలో మరణించినట్లు గురువారం ధ్రువీకరించింది.
Read Also: Fight on Plane: విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ..ఎమర్జెన్సీ ల్యాండింగ్
హనియే హత్యకు గురైన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. హనియే హత్యలో ఇజ్రాయిల్ పాత్ర ఉందని హమాస్ ఆరోపించినప్పటికీ, వీటిపై ఇజ్రాయిల్ మాత్రం సైలెంట్‌గా ఉంది. మహ్మద్ దీఫ్ అక్టోబర్ 07 నాటి దాడులకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. గతేడాది ఇజ్రాయిల్‌పై జరిగిన దాడిలో 1200 మంది చనిపోగా, 240 మందిని బందీలుగా హమాస్ పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి దీఫ్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తోంది.
‘‘మేము ఇప్పుడు ధృవీకరించగలము: మహ్మద్ దీఫ్ తొలగించబడ్డాడు’’ హమాస్ రాజకీయ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన ఇస్మాయిల్ హనియే అంత్యక్రియల ఊరేగింపు కోసం టెహ్రాన్‌లో భారీగా హాజరైన నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ పోర్సెస్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.