Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకి చెందిన 24 ఏళ్ల యువకుడిని భూ వివాదంలో నలుగురు వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టిన తర్వాత తనను వీధి కుక్కలు రక్షించాయని చెప్పాడు.
తాజాగా విడుదలైన జాబితాలో ప్రపంచ దేశాధినేతల్లో మోడీ తొలిస్థానంలో నిలిచారు. నరేంద్ర మోడీ మరోసారి 69 శాతం ఆమోదం రేటింగ్‌లతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా అవతరించారని మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల సర్వే పేర్కొంది.
Sanjay Raut: రాహుల్ గాంధీపై దాడి జరుగొచ్చని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న వారందరిపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Air India: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని టెహ్రాన్‌లో హత్య చేయడం, ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
Breaking News: లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పథకంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Maharashtra Shocker: మహారాష్ట్ర నేవీ ముంబైలో యశశ్రీ హత్య ఘటన మరవకముందే, సతారాలో ప్రియుడి చేతిలో మరో యువతి హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని ఆమె ప్రియుడు బిల్డింగ్‌పై నుంచి తోసేసి హత్య చేశాడు.
Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియేని హత్య చేశారు.
Adhir Chowdhury: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ అధిర్ రంజర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కాంగ్రెస్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Wayanad Landslide: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. గురువారం వాయనాడ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో, మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రాణాలతో బయటడిన వారందర్ని రక్షించినట్లు అంచనా వేశారు.
Delhi High Court: గర్భం దాల్చడం అనారోగ్యం లేదా అంగవైకల్యం కానది ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సాకుతో మహిళలకు ప్రభుత్వాలను నిరాకరించరాదని కోర్టు పేర్కంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ)ని ఆలస్యం చేయాలంటూ ఓ గర్భిణి చేసిన అభ్యర్థనను తిరస్కరించినందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ని కోర్టు విమర్శించింది.