First Mobile Phone Call: ప్రస్తుతం భారత్ దేశం డిజిటల్‌గా మారుతోంది. మొబైల్ ఫోన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నాము. ఒకప్పుడు ఇలాంటి ఒక పరివర్తన వస్తుందని కనీసం ఊహించలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మొబైల్ తయారీతో పాటు వాటి వినియోగంలో ప్రపంచంలోనే భారత్, చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సత్తా చాటుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇండియాలో ఉన్న విధంగా డిజిటల్ చెల్లింపులు లేవనడంలో అతిశయోక్తి లేదు.
అంతగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. భారత్‌లో 30 ఏళ్ల క్రితం అంటే, జూలై 31, 1995న మొట్టమొదటి మొబైల్ కాల్ వెళ్లింది. తాజాగా ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) 1995లో భారతదేశంలో చేసిన మొట్టమొదటి కాల్ గురించిన వార్తల క్లిప్పింగ్ యొక్క చిత్రాన్ని Xలో పంచుకుంది. ప్రస్తుతం దేశంలో 1.2 బిలియన్ మొబైల్ యూజర్లు ఉన్నట్లు చెప్పింది. మూడు దశాబ్ధాల్లో భారత్‌లో ఇంటర్నెట్, వీడియో కాల్స్, మల్టీ మీడియా షేరింగ్‌లకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.
భారత్‌లో తొలి మొబైల్ కాల్ కొల్‌కతా నుంచి న్యూఢిల్లీకి వెళ్లింది. 1995, జూలై 31న అప్పటి పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి జ్యోతి బసు నోకియా హెడ్‌సెట్ నుంచి న్యూఢిల్లీలోని కేంద్రం టెలికాం మంత్రి సుఖ్‌రామ్‌కి మొదటికాల్ చేశారు. ఇది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థల్లో చారిత్రాత్మకంగా నిలిచింది.
1995 ➡️ पहली कॉल
आज ➡️1.2 billion मोबाइल यूजर्स📱 pic.twitter.com/zDp53dGSXv— DoT India (@DoT_India) July 31, 2024