Mohammed Deif: వరసగా ఇజ్రాయిల్ శత్రువుల హతమవుతున్నారు. ఇరాన్‌లో టెహ్రాన్‌లో జరిగబోయే ఆ దేశ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి హాజరైన సమయంలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. అయితే, ఈ హత్యపై ఇజ్రాయిల్ సైలెంట్‌గా ఉంది. దీనికి ముందు లెబనాన్‌లోని బీరూట్‌పై ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసి హిజ్బుల్లా కమాండర్ షుక్ర్ ని హతమార్చింది. తాజాగా గురువారం మరో హమాస్ ఉగ్రవాది, ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ మహ్మద్ దీఫ్‌ని చంపేసినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది.
గతేడాది ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 07 నాటి దాడులకు మహ్మద్ దీఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ అతడిని టార్గెట్ చేసింది. గత నెలలో గాజాపై జరిగిన వైమానిక దాడిలో అతడిని చంపేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 07 దాడిలో హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1195 మందిని చంపేసింది. దీనిలో దీఫ్ కీలకంగా వ్యవహరించినట్లు ఇజ్రాయిల్ నమ్ముతోంది.
Read Also: Wayanad landslide: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్‌బాల్ మైదానాలతో సమానం: ఇస్రో..
ఎవరీ దీఫ్:
మహ్మద్ దీఫ్ 1965లో గాజా స్ట్రిప్ లోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించారు. అతను 1988లో ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజా నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా మొదటి ఇంటిఫాదా సమయంలో హమాస్ స్థాపించిన కొద్దికాలానికే డీఫ్ 1987లో హమాస్‌లో చేరారు. 1989లో ఇజ్రాయిల్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, 16 నెలల శిక్ష తర్వాత ఖైదీల మార్పిడిలో భాగంగా 1991లో విడుదలయ్యాడు.
దీఫ్ హమాస్ సాయుధ విభాగం అయిన ఎజ్జీదీన్ అల్ కస్సామ్ బ్రిగేడ్‌ని2002లో స్థాపించడంలో సాయం చేశాడు. 2002లో సలాహ్ షెహాడే హత్య తర్వాత దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. దీఫ్ ఈ విభాగాన్ని మరింత శక్తివంతంగా మార్చాడు. మహ్మద్ డీఫ్ 1990లు మరియు 2000వ దశకం ప్రారంభంలో అనేక విధ్వంసకర ఆత్మాహుతి బాంబు దాడులను నిర్వహించాడు, ఇందులో 1996 జాఫా రోడ్ బస్సు బాంబు పేలుళ్లు కూడా ఉన్నాయి. అనేక మంది ఇజ్రాయెల్ సైనికుల కిడ్నాప్‌లు మరియు హత్యలకు కూడా అతను సూత్రధారి. ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడి, సొరంగాల్లో ఉంటూ యుద్ధం చేయాలనే వ్యూహాన్ని రూపొందించాడు.
2001 నుంచి ఇతను ఏడు సార్లు హత్యాయత్నాల నుంచి తప్పిచుకున్నాడు. ఇతనికి ‘‘ ది క్యాట్ విత్ నైన్ లైవ్స్’’ అనే పేరు కూడా ఉంది. ఇజ్రాయిల్ దళాలు ఇతడిని టార్గెట్ చేస్తూ ఇళ్లు, కుటుంబంపై దాడులు చేసింది. 2014 ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో ఇతని భార్య, శిశువుతో పాటు 3 ఏళ్ల కుమార్తె కూడా మరణించింది. దీఫ్ హత్యాయత్నాల్లో అతడి కంటిని కూడా కోల్పోయాడు. 1995 నుంచి ఇజ్రాయిల్ ఇతడి కోసం వేట సాగిస్తోంది. 2015, 2023లో యూఎస్, ఈయూలు ఇతడిని ఉగ్రవాద జాబితాలో చేర్చారు. . 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలోని దాడికి డీఫ్ సూత్రధారిగా వ్యవహరించాడు. అల్-అక్సా మసీదు వద్ద ఇజ్రాయెల్ చర్యలకు మరియు పాలస్తీనియన్ల హత్యకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు.