Middle East Tensions: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య చేయబడటం, హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌ని ఇజ్రాయిల్ హతమార్చిడం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతల్ని పెంచింది. ఇరాన్ గడ్డపై హనియే హత్యచేయబడటంపై ఆ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
Israel: ఇజ్రాయిల్ వరసగా తన శత్రువల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రతలో ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. తామే చేశామని చెప్పుకోకున్నా, ఇరాన్‌తో పాటు హమాస్ ఇది ఇజ్రాయిల్ పనే అని ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులకు భారతీయ రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని ఇజ్రాయిల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది.
Shubhanshu Shukla: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇండో-యూఎస్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లడానికి అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిని ఎంపిక చేసింది.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ శివారులో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ‘‘జన ఆందోళన్ సభ’’ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది.
Bombay High Court: భారత ప్రభుత్వం ‘‘దేశం వదిలి వెళ్లాలి’’ అని నోటీసులు జారీ చేసినప్పటికీ యెమెన్‌కి చెందిన వ్యక్తి ఇండియాలో ఉండటంపై బాంబే హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. అధికార డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ని ఎదుర్కోబోతున్నారు.
Mid-Air Flight: అమెరికా న్యూజెర్సీలో ఓ వ్యక్తి అనుచిత ప్రవర్తన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడానికి కారణమైంది. అమెకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న 26 ఏళ్ల ఎరిక్ నికోలస్ గాప్కో ప్రవర్తన కారణంగా విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే హత్యకు గురయ్యాడు. పటిష్టమైన భద్రత కలిగిన ఇరాన్లో ఈ హత్య ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది.