Wayanad landslide: ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా వాయనాడ్‌లో మంగళవారం మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు చాలా మంది బురద కింద సమాధి అయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో 293 మంది చనిపోయారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రెస్కూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు 1000 మందిని రక్షించింది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో 240 మంది ఇప్పటికీ కనిపించడం లేదు.
Read Also: Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?
ఇస్రోతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా శాటిలైట్ చిత్రాలు ఈ విపత్తు ఏ మేరకు ఉందనే విషయాన్ని అంచనా వేశాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ మైదానాలతో సమానంగా ఉందని అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడి ఇరువజింఝి నదిలోకి జారిపోయాయి. దీంతో వివత్తు ఏర్పడింది. ఉపగ్రహ డేటా ఆధారంగా ఇస్రో గురువారం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించింది. సుమారుగా ఈ ప్రాంతంలో 86,000 చదరపు మీటర్లు అంటే, ఫిఫా నిబంధనల ప్రకారం ఒక్కో ఫుట్‌బాల్ మైదానం 6400 చ.మీ ఉంటుంది, కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్‌బాట్ స్టేడియాల కన్నా ఎక్కువ.
జూలై 30 తెల్లవారుజామున వైత్తిరి తాలూకాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. జూలై 31న దాని RISAT-2B ఉపగ్రహం ద్వారా సంగ్రహించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇస్రో విశ్లేషించింది. బురద, పెద్ద పెద్ద బండరాళ్లు, నెలకొరిగిన చెట్లు సుమారు 8 కి.మీ వెళ్లి చెలియార్ నది ఉపనదిలో పడిపోయాయి. ఇది ఇరవానిఫుజార్ నది గమనాన్ని పెంచింది. ఫలితంగా బురదతో కూడిన వరద ఊళ్లపై విరుచుకుపడింది. విపత్తుకు కేంద్రంగా ఉన్న ఇరువజింఝి నది, ఇది ముండక్కైకి ఎగువన 3 కి.మీ దూరంలో ఉద్భవిస్తుంది. సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కొండచరియలు విరిగిపోయినట్లు ఇస్రో తెలిపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సెంటినెల్-1 ఉపగ్రహం ఆగస్ట్ 1, 2024 గురువారం వయనాడ్‌లోని బురద ప్రవాహాన్ని సంగ్రహించింది.