Emergency: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ‘‘ఎమర్జెన్సీ’’ వివాదాస్పదమవుతోంది. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పాలనలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం సినిమాని వ్యతిరేకించడంతో వివాదం నెలకొంది.
Read Also: Kolkata Rape Case: కోల్‌కతాలో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు
ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రతీ వర్గం యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని సెన్సార్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ సినిమాకు మరిన్ని కట్స్‌ని బోర్డు కోరినట్లు తెలుస్తోంది. నిజానికి సినిమాని సెప్టెంబర్ 6న విడుదల చేయాల్సి ఉంది. దీంతో బోర్డు మర్ని కోతలని కోరడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సోమవారం కంగనా, చిత్ర బృందంతో రేపు సమావేశం కానుంది. శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ సినిమాపై వస్తున్న వివాదాలపై కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ హత్య, పంజాబ్ అల్లర్ల వంటి కొన్ని చారిత్రక సంఘటనలు, వ్యక్తులను చిత్రీకరించకూడదని సెన్సాన్ సభ్యులను బెదిరించడం వల్లే సర్టిఫికేట్ ప్రక్రియ ఆగిపోయిందని ఆమె ఆరోపించారు. ఈ చిత్రంపై అకల్ తఖ్త్ మరియు శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC) వంటి సిక్కు సంస్థల నుండి బలమైన ప్రతిస్పందనలు వచ్చాయి. ఎమర్జెన్సీ ట్రైలర్‌లో ఖలిస్తాన్ ఉద్యమకారుడు దివంతగ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఉన్నట్లు చూపించడంతో వివాదం చెలరేగింది.