Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: నివేదిక
- షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మైనారిటీలపై దాడులు..
- బలవంతంగా మైనారిటీ ఉపాధ్యాయుల రాజీనామా..
- బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో 205 దాడులు..
- తాజా నివేదికలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత నుంచి ఆ దేశంలో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగాయి. హింసాత్మక బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంస్థ బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ పంచుకున్న నివేదిక ప్రకారం, ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం 49 మంది ఉపాధ్యాయులు రాజీనామా చేయవలసి వచ్చింది.బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ విద్యార్థి విభాగం. మైనారిటీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు బలవంతంగా రాజీనామాలను చేయాల్సి వచ్చిందని శనివారం నివేదికను విడుదల చేశారు.
Also Read
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Read Also: Giriraj Singh: ‘‘హిందువులు ఎప్పుడూ సెలవులను డిమాండ్ చేయరు’’.. నమాజ్ బ్రేక్ రద్దుపై కేంద్రమంత్రి..
దేశవ్యాప్తంగా మైనారిటీ ఉపాధ్యాయులు భౌతిక దాడుల్ని ఎదుర్కొన్నారు. వారిలో కనీసం 49 మంది రాజీనామా చేయాల్సి వచ్చిందిన సమన్వయకర్త సాజిబ్ సర్కార్ చెప్పారు. అయితే, వీరిలో 19 మందిని తర్వాత తిరిగి నియమించినట్లు నివేదిక పేర్కొంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు, క్రైస్తవ సంఘాల సభ్యులపై అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. దేవాలయాలను తగలబెట్టడంతో పాటు మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకున్నాయి.
ఈ అల్లర్ల తర్వాత నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ మరియు బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ సంస్థలు సంకలనం చేసిన డేటా ప్రకారం, హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి దేశంలోని మైనారిటీ వర్గాల సభ్యులు 52 జిల్లాల్లో కనీసం 205 దాడులను ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!