IC 814 The Kandahar Hijack: IC 814 హైజాక్ సిరీస్‌లో రెండు తప్పులు: రియల్ పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..
- వివాదంలో చిక్కుకున్న నెట్‌ఫ్లిక్ వెబ్ సిరీస్..
- ‘‘IC 814 ది కాందహార్ హైజాక్’’పై విమర్శలు..
- ఇందులో రెండు తప్పులు ఉన్నాయన్న నిజమైన పైలట్ కెప్టెన్ దేవీ శరణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IC 814 The Kandahar Hijack: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘‘IC 814 ది కాందహార్ హైజాక్’’ సంచలనంగా మారింది. 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC 814 హైజాక్ ఘటన ఇతివృత్తంగా ఈ సిరీస్ రూపొందించబడింది. అయితే, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. హైజాక్ చేసిన ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో ఇద్దరిని భోళా, శంకర్ అనే హిందువుల పేర్లతో పిలవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ని టార్గెట్ చేశారు. ఉగ్రవాదుల గుర్తింపును మార్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు ఆరోపించారు. మరోవైపు కేంద్రం కూడా నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది.
Read Also: Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో రెండు తప్పులు ఉన్నాయని ఐసీ 814 నిజమైన పైలట్ కెప్టెన్ దేవీ శరణ్ తెలిపారు. వెబ్ సిరీస్‌లో చూపించినట్లు విమానానికి సంబంధించిన ప్లంబింగ్ లైన్లను తాను రిపేర్ చేయలేదని, అయితే ఉగ్రవాదులకు అవి ఎక్కడ ఉంటాయో తెలియకపోవడంతో విమానం హోల్డ్‌లోకి తీసుకెళ్లానని చెప్పారు. ఇదే విధంగా అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తమకు సెల్యూట్ చేయలేదని, కానీ ఆయన మా ప్రయత్నాలను అభినందించారని వెల్లడించారు.
పాకిస్తాన్‌కి చెందిన హర్కత్ ఉల్ ముజాహీదీన్ ఉగ్రసంస్థ ఇండియాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదుల్ని విడిపించేందుకు ఈ చర్యకు పాల్పడింది. జైషే మహ్మద్ చీఫ్ మైలానా మసూద్ అజార్‌తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని బందీల కోసం విడుదల చేశారు. ఈ హైజాక్ ఘటనలో ఒక ప్రయాణికుడిని ఉగ్రవాదులు చంపేశారు.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!