Kargil War: 1999లో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల ముసుగులో కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. అయితే, ఈ యుద్ధం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడిచినా ఇందులో పాకిస్తాన్ ఆర్మీ తన ప్రేమేయం గురించి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఈ యుద్ధం వెనక కర్త,కర్మ,క్రియ అంతా పాకిస్తాన్ ఆర్మీ అనేది బహిరంగ రహస్యమే అయినా, ఎప్పుడు కూడా తన పాత్రను అంగీకరించలేదు. ఇదిలా ఉంటే, తొలిసారిగా పాకిస్తాన్ ఈ యుద్ధంతో తమ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Plane Hijackings: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’ వల్ల ఇప్పుడున్న తరానికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 1999లో హైజాక్ ఘటన గురించి తెలుస్తోంది. దీనిపై వచ్చిన వివాదాల సంగతి ఎలా ఉన్నా, అప్పుడు జరిగిన పరిణామాల గురించి తెలుసుకోగలిగారు. అయితే, భారతదేశంలో ఇప్పటి వరకు 16 సార్లు విమానాల హైజాక్ జరిగింది. అయితే, ఆ కాలంలో దేశంలో ఉన్న ఒకే ఒక్క ఎయిర్ లైన్ సంస్థ ‘‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’’ ఈ హైజాకింగ్ ఘటనల్ని ఎదుర్కొంది.
Pakistan: ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ భారీ జాక్‌పాట్ కొట్టింది. పాక్ పంట పండింది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో భారీగా పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించారు. వీటి ద్వారా పాక్ తన తలరాతను మార్చుకునే అవకాశం ఏర్పడింది. చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనేందుకు స్నేహపూర్వక దేశం సహకారంతో మూడేళ్లు సర్వే చేశామని డాన్ న్యూస్ టీవీకి శుక్రవారం సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Donald Trump: ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే హిందూ సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కొరోలినాలో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గురువారం సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కమలా హారిస్ ‘‘భారత్-అమెరికా సంబంధాలను చాలా అస్థిరపరుస్తారు’’అని పేర్కొన్నారు.
Maharashtra: మహారాష్ట్ర ఆహార- ఔషధ నిర్వహణ శాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ పవార్) సీనియర్ నేత ధర్మారావుబాబా ఆత్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహం’’ చేసినందుకు తన కుమార్తె భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పారేయాలని అహేరి నియోజకవర్గ ఓటర్లు కోరారు. వీరిద్దరు శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈయన ఈ వ్యాఖ్యలుచేశారు.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
West Bengal: కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే…
Omar Abdullah: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘IC814: కాందహార్ హైజాక్’ సంచలనంగా మారింది. ఇందులో ఉగ్రవాదులను హిందూ పేర్లతో పిలవడంపై రచ్చ మొదలైంది. అయితే, కేంద్రం వార్నింగ్‌తో మరోసారి ఇలాంటి ఘటన జరగదని నెట్‌ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడిని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది
Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్ […]
‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అదినాయకత్వం భావిస్తోంది.