Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- సిఫారసు చేసిన బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది. వీటిలో చాలా మదర్సాలు బోర్డుకు సంబంధించిన పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడంతో విఫలమయ్యాయి. మిగతావి వివిధ కారణాల వల్ల డిస్-అఫిలియేషన్‌ని కోరుకుంటున్నాయి.
యూపీ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మదర్సాలు ఉన్నాయి. వీటిలో 16500 మదర్సాలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉన్నాయి. మదర్సా బోర్డు ఛైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ మంగళవారం జరిగిన సమావేశంలో మొదటి ప్రతిపాదన 2018 నుంచి 2024 వరకు మార్క్‌షీట్‌లను అప్‌లోడ్ చేయడం. పాత మార్క్ షీట్లను కూడా పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త మదర్సాల అఫిలియేషన్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అఫిలియేషన్ కోసం కొత్తగా దరఖాస్తులు పోర్టల్ ద్వారా ఆమోదించబడుతాయి’’ అని అన్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Read Also: JK Encounter: ఉదంపూర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
వివిధ జిల్లా లనుంచి స్వీకరించిన సుమారు 513 మదర్సాల సరెండర్ మరియు గుర్తింపు రద్దు ప్రతిపాదనల్ని బోర్డు ఆమోదించిన తర్వాత 2016 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్‌కి అధికారం ఇవ్వబడింది. వివిధ జిల్లా నుంచి స్వయంగా బోర్డు నుంచి డిస్-అఫిలియేషన్ కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటికి కారణాలు తెలుసుకోవడంతో పాటు, నిబంధనల ప్రకారం వాటి రద్దు జరుగుతుంది.
యుపి మదర్సా బోర్డు ప్రతిపాదనపై ముస్లిం మత గురువు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ స్పందిస్తూ, “డి-అఫిలియేషన్ అంటే మదర్సాలకు రహదారి ముగింపు అని కాదు. అనేక ఇతర మదర్సాల మాదిరిగా సొసైటీ లేదా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థను కొనసాగించే అవకాశం వారికి ఇప్పటికీ ఉంటుంది. అలాగే, వారు ఇతర బోర్డులు లేదా నద్వతుల్ ఉలమా వంటి సంస్థల నుండి అఫిలియేషన్ తీసుకోవచ్చు.’’ అని చెప్పారు.
- Tags
- UP news
- Uttar Pradesh
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!