Bangladesh: టెక్ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ని బంగ్లాదేశ్ ఆహ్వానించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రధాన సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ తమ దేశాన్ని సందర్శించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ మేరకు యూనస్, మస్క్‌కి లేక రాసినట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్ సేవలను ప్రారంభించే అవకాశం కోసం బంగ్లాదేశ్‌ను సందర్శించాలని ప్రొఫెసర్ యూనస్ ఎలోన్ మస్క్‌కు ఆహ్వానం పంపారు.
Read Also: Russia Ukraine War: యుద్ధానికి 3 ఏళ్లు.. 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..
స్టార్‌లింక్ కనెక్టివిటీని దేశ మౌలిక సదుపాయాలలో అనుసంధానించడం వల్ల దాని యువత, మహిళల పరివర్తనపై ప్రభావం ఉంటుందని అన్నారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ పర్యటన ద్వారా బంగ్లా యువతను కలిసే అవకాశం కలుగుతుందని యూనస్ స్పేస్‌ఎక్స్, టెస్లా సీఈవోతో అన్నట్లు నివేదించింది. “మెరుగైన భవిష్యత్తు కోసం మన పరస్పర దార్శనికతను అందించడానికి కలిసి పనిచేద్దాం” అని నోబెల్ గ్రహీత యూనస్ లేఖలో పేర్కొన్నారు.
90 రోజుల్లో బంగ్లాదేశ్‌లో స్టార్ లింక్‌ని ప్రయోగానికి సిద్ధం చేయడానికి అవసరమైన పనిని పూర్తి చేయాలని స్పేస్‌ఎక్స్ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని తన ప్రతినిధి డాక్టర్ ఖలీలూర్ రెహ్మాన్‌ని యూనస్ కోరారు. బంగ్లాదేశ్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని ప్రవేశపెట్టడంలో భవిష్యత్ సహకారాన్ని అన్వేషించడానికి, మరింత పురోగతి సాధించడానికి యూనస్, మస్క్‌తో ఫిబ్రవరి 13న వీడియో చర్చని నిర్వహించారు.