Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం
- కొత్త కార్యదర్శి నరేశ్ పాల్ గంగ్వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naresh Pal Gangwar Higher Education Secretary: NEET-UG పరీక్షలో అక్రమాల ఆరోపణలు, పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎవరు నరేశ్ పాల్ గంగ్వార్?
నరేశ్ పాల్ గంగ్వార్ 1994 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ IAS అధికారి. ఆయన ఇప్పటివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గతంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన గంగ్వార్, కేంద్రంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
వినీత్ జోషికి కొత్త బాధ్యతలు
1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్ కేడర్ IAS అధికారి వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు.
NEET వివాదం ఎలా మొదలైంది?
NEET-UG పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జూన్ 20 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని CJP ప్రధాన డిమాండ్‌గా పెట్టుకుంది.
సోనం వాంగ్‌చుక్ దీక్షతో మరింత ఊపందుకున్న ఉద్యమం
జూన్ 28న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఈ నిరసనలో పాల్గొని నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. జూలై 20న CJP ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి పిలుపునివ్వగా, నిరసనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చర్చలకు సిద్ధమని కేంద్రం
ఈ పరిణామాల అనంతరం కేంద్ర ప్రభుత్వం పలుమార్లు CJP ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. అయితే, కేంద్ర మంత్రులే జంతర్ మంతర్ లేదా నిరసన ప్రాంతానికి సమీపంలోని వేదికకు రావాలని CJP స్పష్టం చేసింది. NEET వివాదం, పేపర్ లీక్ కేసులు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటుండగా, రానున్న రోజుల్లో ఈ అంశంపై మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!