Man Kills wife: భార్యని నమ్మించి కుంభమేళాకు తీసుకెళ్లిన భర్త, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధాన్ని దాచేందుకు పెద్ద కట్టుకథని అల్లాడు. చివరకు యూపీ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురికి చెందిన ఒక జంట కుంభమేళ కోసం యూపీ ప్రయాగ్‌రాజ్‌కి వచ్చారు. అక్కడే ఒక హోమ్ స్టేలో బస చేశారు.
ఫిబ్రవరి 18 రాత్రి ప్రయాగ్ రాజ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో భార్య గొంతు కోసం హత్య చేశాడు. ప్రయాగ్ రాజ్ కమిషనరేట్ పోలీసులు 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. ఫిబ్రవరి 19 ఉదయం, ఝున్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజాద్ నగర్ కాలనీలోని ఒక హోమ్‌స్టే బాత్రూంలో 40 ఏళ్ల మహిళ రక్తంతో తడిసిన మృతదేహం కనుగొనబడింది. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో.. ఒక జంట రూంలో బస చేసినట్లు హోమ్ స్టే మేనేజర్ వెల్లడించారు. అయితే, వారి వద్ద నుంచి ఎలాంటి గుర్తింపు ఆధారాలను హోమ్ స్టే మేనేజర్ తీసుకోకపోవడం గమనార్హం.
ఫిబ్రవరి 18 రాత్రి ఢిల్లీ నుంచి జంట ప్రయాగ్‌రాజ్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మహిళ ఫోటోని విస్తృతంగా సోషల్ మీడియాలో పోలీసులు షేర్ చేశారు. చివరకు బాధితురాలిని ఢిల్లీకి చెందిన నివాసి అశోక్ కుమార్ భార్య మీనాక్షిగా బంధువులు గుర్తించారు. ఆమె ఫోటోని చూసి ఆమె సోదరుడు ప్రవేశ్ కుమార్, అమె ఇద్దరు కుమారులు అశ్వని, ఆదర్శ్ ఆమె గుర్తింపుని నిర్ధారించారు.
Read Also: Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం
వివాహేతర సంబంధం కారణంగానే హత్య..
విచారణలో బాధితురాలి భర్త అశోక్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. తూర్పు ఢిల్లీలోని త్రిలోక్ పురిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే అశోక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యని చంపి తన అక్రమ సంబంధాన్ని కొనసాగించాలని ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి 17న ఢిల్లీ నుంచి అశోక్ కుమార్, మీనాక్షితో కలిసి ప్రయాగ్‌రాజ్ బయలుదేరాడు. తర్వాతి రోజు హోమ్ స్టేలో బస చేశారు. మీనాక్షి బాత్రూం వెళ్తున్న సమయంలో, వెనక నుంచి కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె బట్టలను మార్చి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని మాయం చేశాడు.
ఈ హత్యను కప్పిపుచ్చేందుకు తల్లి కుంభమేళలో తప్పిపోయిందని, కుమారుడు అశిష్‌కి ఫోన్ చేసి చెప్పాడు. తప్పిపోయినట్లు నటించాడు. అయితే, పెద్ద కొడుకు అశ్విన్ ఫిబ్రవరి 20న తల్లి ఫోటోతో ప్రయాగ్ రాజ్‌లో వెతకడం ప్రారంభించాడు. హత్యకు ఒక రోజు ముందు, ఫిబ్రవరి 18న, అశోక్ తాను మరియు మీనాక్షి పవిత్ర స్నానం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. పోలీసులు నిఘా పుటేజ్, ఫోరెన్సిక్ నివేదికలతో నిందితుడు అశోక్ కుమార్‌ని అరెస్ట్ చేశారు.