Crime: మహారాష్ట్రలోని భివాండీలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆమెపై అఘాయిత్యం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20వ తేదీ తెల్లవారుజామున ఒక పాఠశాలలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. మహిళపై ఆమె మాజీ ప్రియుడు అపహరించి, అతడి నలుగురు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు.
మహిళ, ప్రధాన నిందితుడు గతంలో కొన్ని ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆ మహిళ మరొక వ్యక్తితో రిలేషన్‌లోకి వెళ్లడంపై మాజీ ప్రియుడు కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఫిబ్రవరి 19 రాత్రి మహిళ సోదరుడిని నిందితులు కిడ్నాప్ చేశారు, ఆమెను ఇక్కడికి పిలిపించాలని ఆమె సోదరుడిపై ఒత్తిడి చేశారు.
Read Also: Vishvambhara : చిరంజీవి విశ్వంభర ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?
‘‘ఘటన జరిగిన రాత్రి మహిళకు తన సోదరుడి నుంచి ఫోన్ వచ్చింది. అతను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పాడు. మహిళ తన సోదరుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. మహిళతో పాటు ఆమె సోదరుడు, ఆమెను తీసుకెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్‌పై నిందితులు దాడి చేశారు’’ అని అధికారులు వెల్లడించారు. నిందితులు నాగావ్ లోని ఒక పాఠశాల దగ్గర, ఫాతిమా నగర్‌లోని పికప్ వ్యాన్ లోపల ఆమెపై అత్యాచారం చేసినట్లు, రెండు వేర్వేరు ప్రాంతాల్లో మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
తప్పించుకుని బయటపడిన తర్వాత బాధితురాలు భివాండీ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆరుగురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) కింద అత్యాచారం, సామూహిక అత్యాచారం మరియు ఇతర నేరాలకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపబడ్డాయి. నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.