Yahya Sinwar: సిన్వార్‌ని చంపుతూ హీరోని చేసిన ఇజ్రాయిల్.. వీడియో రిలీజ్ చేసి తప్పు చేసిందా..?
- సిన్వార్‌ని చంపుతూ హీరోని చేసిన ఇజ్రాయిల్..
- వీడియోని రిలీజ్ చేసి తప్పు చేసిందా..?
- చాలా మంది గాజన్లలో స్పూర్తికి కారణమవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yahya Sinwar: ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ హమాస్ లీడర్, ఉగ్రసంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్ గురించి గత దశాబ్ధ కాలం నుంచి ఇజ్రాయిల్ వెతుకుతోంది. అత్యంత రహస్యంగా గాజాలోని భూగర్భ టన్నెల్స్‌లో తన భార్య, పిల్లలతో నివాసం ఉండే సిన్వార్ చివరకు కొత్తగా సైన్యంలో చేరిన సైనికులు అంటే.. కేవలం ఇజ్రాయిల్ ఆర్మీలో 9 నెలల క్రితమే చేరిన 20 ఏళ్ల లోపు యువకుల చేతిలో హతమయ్యాడు.
సిన్వార్‌ని హతమార్చడంపై ఇజ్రాయిల్‌లో సంబరాలు మిన్నంటాయి. సిన్వార్ హత్య యుద్ధానికి అంతానికి తొలిమెట్టుగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అభివర్ణించారు. తమ బందీలను విడిచిపెడితే యుద్ధాన్ని ఆపేస్తామంటూ సందేశం పంపారు. ఇజ్రాయిల్‌లో సంబరాలు కొనసాగుతుంటే.. గాజాలో మాత్రం సిన్వార్ మరణం పట్ల విషాదం నెలకొంది. సిన్వార్ మరణం తర్వాత హమాస్ చీఫ్ పదవికి పోటీలో హమాస్ వ్యవస్థాపకుడు మరియు సీనియర్ సభ్యుడు మహమూద్ అల్-జహర్, యాహ్యా సోదరుడు మహ్మద్ సిన్వార్ ఉన్నారు.
Also Read
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
సిన్వార్ మరణించడానికి ముందు ఇజ్రాయిల్ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ వీడియోని విడుదల చేసి తప్పు చేశామా..? అని ఇజ్రాయిల్ ఒకింత బాధపడుతోంది. శిధిలంగా మారిన ఒక బిల్డింగ్‌లో ఓ కుర్చీలో కూర్చున్న సిన్వార్, ఇజ్రాయిల్ డ్రోన్ పైకి ఒక కర్రను విసిరిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పుడు ఈ వీడియోనే, ఇజ్రాయిల్ ధిక్కారానికి సిన్వార్ ప్రతిఘటన అనే రీతిలో ప్రచారం జరుగుతోంది. చాలా మంది గాజన్లు, హమాస్ మద్దతుదారులు ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఆయన చివరి చర్యగా గుర్తుంచుకున్నారు.
Read Also: Telangana: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ రూ.100కోట్ల విరాళం
జియోనిస్ట్(ఇజ్రాయిల్) ఆక్రమణకు వ్యతిరేకంగా అతని చివరి చర్య అని, అతడి మరణించి లెజెండ్ అయ్యారని జర్నలిస్ట్, చిత్ర నిర్మాత డాన్ కోహెన్ ట్వీట్ చేశారు. సిన్వార్ సొరంగాల్లో దాక్కుని మానవ కవచాలను ఉపయోగిస్తున్నాడనే ఇజ్రాయిల్ వాదనని డ్రోన్ చిత్రాలు తప్పని రుజువు చేశాయని కొందరు చెబుతున్నారు. సిన్వార్‌ని ఇజ్రాయిల్ సైన్యం పెట్రోలింగ్ సమయంలో అతడికి పెద్దగా భద్రత లేదు. సిన్వార్ తప్పించుకునేందుకు ఒక భవనంలోకి దూరడంతో, ఇజ్రాయిల్ బలగాలు దానిలోకి ఒక షెల్ ప్రయోగించి దాడి చేసింది. ఆ తర్వాత డ్రోన్‌ని పంపించి సిన్వార్ పరిస్థితిని క్యాప్చర్ చేసింది.
సిన్వార్‌ని ఇజ్రాయిల్ చంపుతూ.. అతడిని ‘‘అమరుడి’’గా మార్చిందని, అతడు నిజమైన యోధుడని, చివరి వరకు పోరాడుతూ అమరుడయ్యాడని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. సిన్వార్ చివరి చిత్రాలు చాలా మంది గాజా ప్రజల్లో మరింత స్పూర్తిని రగిలిస్తుందనేది వాస్తవం. గాజాలో హమాస్ పట్ల మరింత మంది ఆకర్షితులయ్యేందుకు ఈ వీడియో సహకరిస్తుందని పలువురు భావిస్తున్నారు. దీంతో తాము ఈ వీడియోని రిలీజ్ చేసి తప్పు చేశామని ఇజ్రాయిల్ భావిస్తోంది.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..