Delhi pollution: ఢిల్లీలో కాలుష్యానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో రావడమే అని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం అన్నారు. నగరంలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి ఇతర రాష్ట్రాల బస్సులే కారణమవుతున్నాయని, బస్ డిపోల్లో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.
Sanjay Raut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఆదివారం బీజేపీ 99 మందితో అభ్యర్థుల తొలి లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన(ఠాక్రే), ఎన్సీజీ(శరద్ పవార్) పార్టీల కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యలో మరో అరెస్ట్ జరిగింది. హత్య కోసం షూటర్లకు ఆయుధాలు అందించిన స్క్రాప్ డీలర్‌ని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులు ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్ చేయబడ్డారు. నిందితుడిని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన భగవత్ సింగ్ ఓం సింగ్ (32)గా గుర్తించారు, అతను ప్రస్తుతం నవీ ముంబైలో ఉంటున్నాడు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచగా.. అతడికి అక్టోబర్ 26 వరకు పోలీసుల…
RSS: మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహిస్తే, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ మధ్య పోరు నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఇటీవల హర్యానాలో ఎన్నికల్లో గెలుపు మహారాష్ట్ర బీజేపీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందరి కన్నా ముందుగా బీజేపీ 99 మందితో తన తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.
Bihar: భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులు ఇటీవల కాలంలో పట్టుబడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కి చెందిన మరో వ్యక్తిని బీహార్ గయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తాగా పేరు మార్చుకున్న వ్యక్తి గత 8 ఏళ్లుగా ఇండియాలో బౌద్ధ సస్యాసిగా నటిస్తూ అక్రమంగా నివసిస్తున్నాడు.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Bomb threats: వరసగా బాంబు నకిలీ బాంబు బెదిరింపులు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు మరో 6 ఇండిగో విమానాలు కూడా ఇదే తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. 99 మందితో తొలి లిస్ట్‌ని విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులోనే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Delhi school blast: ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు శబ్ధం 2 కి.మీ వరకు వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు […]
US Intelligence Leaked: క్లాసిఫైడ్ అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం లీకైంది. సున్నితమైన సమాచారం లీక్ కావడంతో అమెరికా అధికారుల్లో ఆందోళన పెరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడికి సంబంధించిన వివరాలు లీకైన ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది.